
పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలిప్రేమ క్లాసిక్ గా మిగిలిపోయింది. దర్శకుడు కరుణాకర్ తెరకేక్కించిన ఈ మూవీ భారీ విజయం సాధించింది. పవన్ కి జంటగా కీర్తి రెడ్డి నటించారు. ఈ మూవీ టైటిల్ నాగబాబు కొడుకు వాడుకున్నాడు. బాబాయ్ టైటిల్ తో తెరకెక్కిన తొలిప్రేమ మంచి విజయం అందుకుంది. రాశి ఖన్నా హీరోయిన్ గా వెంకీ అట్లూరి తెరకెక్కించారు. ఇటీవల విజయ్ దేవరకొండ హీరో పవన్ మరో టైటిల్ తీసుకున్నారు. ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా ఉన్న ఖుషి టైటిల్ తో విజయ్ దేవరకొండ మూవీ చేస్తున్నారు.
సమంత ఈ మూవీ హీరోయిన్ గా నటిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ నటించిన మరో హిట్ మూవీ తమ్ముడు టైటిల్ అక్కినేని అఖిల్ వాడుకొనున్నారట. అల్లు అర్జున్ తో మూవీ చేయాలని ఆశపడిన వేణు శ్రీరామ్ కి నిరాశే ఎదురైంది. ఐకాన్ మూవీ ప్రకటించిన తర్వాత కూడా వేణు శ్రీరామ్ కి ఆయన అవకాశం ఇవ్వలేదు. దాదాపు ఐకాన్ ముగిసినట్లే. అల్లు అర్జున్ కి ఏమాత్రం చేసే ఆలోచన లేదు. ఈ క్రమంలో ఆయన కొత్త మూవీ ఆలోచన చేస్తున్నారు.
కాగా వేణు శ్రీరామ్ అఖిల్ తో మూవీ ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ కాగా అఖిల్ తో మూవీ దాదాపు ఖాయమే. ఇక ఈ మూవీ టైటిల్ గా తమ్ముడు అనుకుంటున్నారట. తమ్ముడు మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మంచి హిట్ గా ఉంది. ఈ తమ్ముడు టైటిల్ కూడా అఖిల్ ఉపయోగించుకోనున్నాడట. అఖిల్-వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో వచ్చే మూవీకి తమ్ముడు టైటిల్ అనుకుంటున్నారట. ఇక అక్కినేని హీరో పవన్ టైటిల్ తో రావడం అంటే ఆసక్తికర అంశమే.