ఉదయ్ కిరణ్ కు నేనే పోటీ.. అప్పటి నుంచే తొక్కేయాలని ప్లాన్.. హీరో ఆకాష్!

By tirumala ANFirst Published Jul 24, 2019, 4:55 PM IST
Highlights

ఇస్మార్ట్ శంకర్ చిత్ర కథ తనది అంటూ సడెన్ గా ముందుకు వచ్చారు హీరో ఆకాష్. ఆనందం చిత్రంతో ఆకాష్ తెలుగు ప్రేక్షకుల బాగా చేరువయ్యాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఆనందం ఘనవిజయం సాధించింది. ఇస్మార్ట్ శంకర్ చిత్ర వివాదంతో మరోసారి ఆకాష్ వార్తల్లో నిలిచాడు. 

2001లో విడుదలైన ఆనందం చిత్రంతో ఆకాష్ కు తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత సక్సెస్ ని కొనసాగించక పోవడంతో ఆకాష్ తెలుగు చిత్రపరిశ్రమకు దూరమయ్యాడు. తెలుగు ప్రేక్షకులు తన నుంచి సినిమాలు ఆశిస్తున్నారు కాబట్టి మళ్ళి వచ్చానని ఈ హీరో చెబుతున్నారు. టాలీవుడ్ లో తనపై కుట్ర జరుగుతోందంటూ ఆకాష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచనల వ్యాఖ్యలు చేశాడు. 

ఆనందం తర్వాత చాలా చిత్రాల్లో నటించా. కొంత మంది కుట్రపన్ని ఆ చిత్రాలు విడుదల కానివ్వకుండా అడ్డుకున్నారు. ఇటీవల తానే రాసుకున్న కథతో స్వీట్ హార్ట్ అనే చిత్రాన్ని చేశా. వివి వినాయక్ గారు కూడా ఆ చిత్రం చాలా బావుందని అన్నారు. కానీ సరిగ్గా విడుదల సమయానికి ఎవ్వరూ థియేటర్స్ ఇవ్వలేదు. 

ఆనందం సూపర్ హిట్ తర్వాత నన్ను చూసి చాలామంది భయపడ్డారు. తెలుగు రాకుండానే సూపర్ హిట్ కొట్టేశాడు. తెలుగు నేర్చుకుని నిలదొక్కుకుంటే వీడిని ఆపలేం.. అని అప్పటి నుంచే నాపై కుట్ర మొదలైంది. నేను నటిస్తున్న చిత్రాలని ఏదో ఒక రకంగా చెడగొట్టడానికి ప్రయత్నించారు. 

ఆనందం విజయం తర్వాత ఉదయ్ కిరణ్ కు నేనే పోటీ. కాలేజీ యువతలో మా ఇద్దరికీ సమానంగా అభిమానులు ఉండేవారు. అలాంటి ఉదయ్ కిరణ్ చిత్రంలోనే ఫ్రెండ్ రోల్ లో నన్ను నటింపజేయడానికి కొందరు ప్రయత్నించారు. హీరోగా నేను ఎదగకూడదనేది వాళ్ళ ప్లాన్. 

ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ చిత్రం వల్ల తాను నష్టపోయానని ఆకాష్ చెబుతున్నాడు. తన సినిమా రీ షూట్ చేసేందుకు పూరి జగన్నాధ్ నష్ట పరిహారం అందించాలని ఆకాష్ డిమాండ్ చేస్తున్నాడు. 

 

click me!