
కెజిఎఫ్ ఈ దశాబ్దంలో తెరకెక్కిన బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. 2018లో విడుదలైన కెజిఎఫ్ మూవీ పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. అంతకు మించి యాక్షన్ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దీంతో ఈ మూవీ సీక్వెల్ పై సహజంగానే భారీ హైప్ నెలకొని ఉంది. భాషతో సంబంధం లేకుండా కెజిఎఫ్ 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు.
కాగా నేడు కెజిఎఫ్ 2 ట్రైలర్ (KGF 2 Trailer)విడుదలైంది. దాదాపు మూడు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ ఎవరీ సెకండ్ ఉత్కంఠగా సాగింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, రవీనా టాండన్ పాత్రలు ట్రైలర్ లో హైలెట్ అయ్యాయి. పార్ట్ వన్ లో అనంత్ నాగ్ చేసిన జర్నలిస్ట్ రోల్ పార్ట్ 2 లో ప్రకాష్ రాజ్ చేసినట్లు అర్థం అవుతుంది. కెజిఎఫ్ 2 గరుడ మరణం తర్వాత ఏం జరిగింది? కెజిఎఫ్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి రాకీ ఎలా తీసుకున్నాడు? ఇండియాలోనే పెద్ద బిసినెస్ మెన్ గా ఎదిగిన రాకీకి భారత ప్రభుత్వానికి వైరం ఎలా వచ్చింది? ప్రభుత్వానికి, రాకీకి జరిగిన యుద్ధంలో విజయం ఎవరిది? అనేదే చాప్టర్ 2.
ప్రధాని పాత్ర చేస్తున్న రవీనా టాండన్ రోల్ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉండనుందని అర్థం అవుతుంది. కెజిఎఫ్ పై ఆమె యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి. ట్రైలర్ మెయిన్ విలన్ అధీరాను పరిచయం చేశారు. యుద్ధం వినాశనం కోసమే కాదు ఉద్దరించడానికి కూడా.. కావాలంటే రాబందులను అడుగు చెబుతాయి... అని ఆయన చెప్పిన డైలాగ్ మూవీలో వైలెన్స్ ఈ రీతిలో ఉండనుందో చెబుతుంది.
ఫైనల్ గా హీరో యష్ (Yash)గురించి చెప్పాలంటే.. సూటు బూటులో డాన్ గా ఆయన అదరగొట్టారు. నాకు వైలెన్స్ అంటే ఇష్టం లేదు. కానీ వైలెన్స్ కి నేనంటే ఇష్టం. కాబట్టి నేను అవైడ్ చేయాలంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఓ రేంజ్ లో పేలింది. కెజిఎఫ్ మూవీలో డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అదే స్థాయిలో కెజిఎఫ్ 2 డైలాగ్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth neel)కెజిఎఫ్ చాప్టర్ 2తో చరిత్ర తిరగరాయడం ఖాయంగా కనిపిస్తుంది. కెజిఎఫ్ పార్ట్ 1లో నటించిన శ్రీనిధి శెట్టి పార్ట్ 2లో కూడా నటిస్తున్నారు. ఏప్రిల్ 14న కెజిఎఫ్ 2 ఐదు భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.