‘కోబ్రా’ ఫస్ట్ లుక్ వచ్చేసింది, సీఎం కేసీఆర్ తో సహా..

Published : Apr 08, 2019, 09:38 AM IST
‘కోబ్రా’ ఫస్ట్ లుక్ వచ్చేసింది, సీఎం కేసీఆర్ తో సహా..

సారాంశం

ఇన్నాళ్లూ ఆర్టిస్ట్ ల  నుంచి అద్భుతమైన నటనను రాబట్టడంలో బిజీగా ఉన్న  రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు తనే నటుడుగా మారుతున్నారు.  

ఇన్నాళ్లూ ఆర్టిస్ట్ ల  నుంచి అద్భుతమైన నటనను రాబట్టడంలో బిజీగా ఉన్న  రామ్‌గోపాల్‌ వర్మ ఇప్పుడు తనే నటుడుగా మారుతున్నారు.   ఆర్జీవి గన్‌షాట్‌ ఫిల్మ్‌ బ్యానర్‌లో వస్తున్న ‘కోబ్రా’తో వర్మ తనలోని  నటుడి సత్తా ఏంటో  పరిచయం  చేయబోతున్నారు. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్మ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ఆర్‌ పాత్రలో కనిపిస్తారు.

ఓ క్రిమినిల్ పట్టుకోవటానికి ఓ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలు...చివరకి ఎలా తుద ముట్టించాడనేది చూపబోతున్నట్లు సమాచారం. మరో విషయం ఏమిటంటే  ఇందులో సీయం కేసీఆర్‌ పాత్ర కూడా ఉండటం విశేషం. వర్మతో పాటు ఆగస్త్య మంజు దర్శకత్వం వహించనున్నారు. కీరవాణి స్వరకర్త. .. మరి తెలంగాణ లో ఆ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ ఎవరో ?? గెస్ చేసారా.

ఇక సంచలన చిత్రాలకు మారుపేరుగా నిలుచిన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ. తాజాగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తో వెండితెరపై దూమ్మురేపిన విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత వర్మ మంచి హీట్ అందుకున్నాడు. కాగా వర్మ ఈ చిత్రంతో మరో సంచలనానికి తెర తీశాడు. ఇప్పటి వరకు వర్మ దర్శకుడిగా, నిర్మాతగా, కథా రచయితగా గాయకుడిగా తనలోని కలలను ప్రేక్షకులకు చూపించిన సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ త్వరలో నటుడిగా మారటంతో ఆయన అభిమానులకు పండగ చేసుకోబోతున్నారు.

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌