వెన్నుపోటు పొడిచే ఆ కట్టప్ప ఎవరు...బిగ్ బాస్ ఎపిసోడ్ 3 హైలెట్స్..!

Published : Sep 08, 2020, 11:40 PM ISTUpdated : Sep 09, 2020, 06:46 AM IST
వెన్నుపోటు పొడిచే ఆ కట్టప్ప ఎవరు...బిగ్ బాస్ ఎపిసోడ్ 3 హైలెట్స్..!

సారాంశం

నిన్న ఎలిమినేషన్ కి  నామినేషన్ ప్రక్రియ పూర్తి కాగా ఇంటి సభ్యులు ఆహ్లాదంగా తమ డే మొదలుపెట్టారు. నిద్రలేస్తూనే ఒకరిపై మరొకరికి అపనమ్మకం కలిగేలా కట్టప్ప, వెన్నుపోటు అంటూ బిగ్ బాస్ సభ్యులతో మైండ్ గేమ్ మొదలుపెట్టారు.

నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న 14మంది కంటెస్టెంట్స్ నుండి హీరో అభిజిత్, జోర్దార్ సుజాత, అఖిల్ సార్తక్, దివి,  డైరెక్టర్ సూర్య కిరణ్, గంగవ్వ, మెహబూబ్ లను ఈ వారం ఎలిమినేషన్ కొరకు నామినేట్ చేయడం జరిగింది. ఎలిమినేషన్ కి నామినేట్ అయిన ఇంటి సభ్యులు  ఆ టెన్షన్ మైండ్ లో పెట్టుకోకుండా హౌస్ లో హ్యాపీగా గడిపారు. 

ఇక లాన్ లో బాహుబలి సినిమాలోని ఎపిక్ సీన్ కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే కట్ అవుట్ పెట్టడంతో పాటు, తస్మాత్ జాగ్రత్త మీ ప్రక్కనే వెన్నుపోటు పొడిచే కట్టప్ప ఉన్నాడు అని బిగ్ బాస్ ఒకరిపై మరొకరికి అపనమ్మకం కలిగేలా చేశాడు. ఆ విధంగా ఇంటి సభ్యుల మధ్య మనస్పర్థలు సృష్టించే ప్రయత్నం చేశాడు. దీనిలో భాగంగా తమను ఎవరు వెన్నుపోటు పొడుస్తారని భావిస్తారో అతని పేరు సీక్రెట్ కవర్ లో రాసి పెట్టమన్నాడు బిగ్ బాస్. 

ఇక కరాటే కళ్యాణి టీచర్ వేషం కట్టారు. హౌస్ లోని ఇంటి సభ్యులు పాటించ వలసిన నియమాలు, అతిక్రమిస్తే పడే శిక్షలు తెలియజేశారు. టీచర్ కరాటే కళ్యాణిపై గంగవ్వ పంచ్ లు  నవ్వులు పోయించాయి. 

వంట విషయంలో మోనాల్  ని సరదా కోసం అమ్మ రాజశేఖర్ ఆట పట్టించగా దానికి కూడా మోనాల్ ఏడ్చేశారు. ఇక తనకు భాష ప్రాబ్లం ఉందని, దాని వలన కొందరు తనను ఇబ్బంది పెడుతున్నట్లుగా భావించి మోనాల్ కన్నీరు పెట్టుకున్నారు. ఆమెను ఓదార్చడానికి సుజాత, కరాటే కళ్యాణి రంగంలోకి దిగారు.

ఇక ఇంటి సభ్యలకు లగ్జరీ బడ్జెట్ కేటాయించడం కోసం నిర్వహించిన టాస్క్ లో 14000 పాయింట్స్ కి గాను కేవలం 5000 పాయింట్స్ గెలుపొందారు. ఇక హీరో అభిజిత్, సయ్యద్ సోహెల్ మధ్య సిరీస్ గొడవపడుతున్న ప్రోమోతో ఎపిసోడ్ 3 ముగిసింది.  

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ