12 కోట్ల విలువైన ఇళ్లు అమ్మి, లగ్జరీ కారు కొన్న హేమా మాలిని, ఆమె ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

Published : Sep 02, 2025, 09:42 PM IST
12 కోట్ల విలువైన ఇళ్లు అమ్మి, లగ్జరీ కారు కొన్న హేమా మాలిని, ఆమె ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

సారాంశం

బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని ముంబైలో 12 కోట్ల విలువైన 2 ఫ్లాట్లు అమ్మి కొత్త MG M9 కారు కొన్నారు. ఇంతకీ ఆమె ఆస్తుల విలువ ఎన్ని కోట్లు. 

హేమామాలిని ఆస్తులు

బాలీవుడ్  డ్రీమ్ గర్ల్ హేమామాలిని, సినిమాల్లో రాజకీయల్లో రాణించారు. ఆమె మధుర నుండి బిజెపి ఎంపీగా ఉన్నారు. రీసెంట్ గా హేమా మాలినీ రెండు లగ్జరీ  ఫ్లాట్లు అమ్మి కొత్త కారు కొన్నారు. మీడియా కథనాల ప్రకారం, 12 కోట్లకు 2 ఫ్లాట్లు అమ్మి, 73.83 లక్షల విలువైన MG M9 కారు కొన్నారు. దీంతో హేమామాలిని ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో  చర్చనీయాంశమయ్యారు.  విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న హేమా మాలిని  ఆస్తుల గురించి తెలుసుకుందాం.

హేమామాలిని కోట్ల సంపాదన 

2024 లోక్‌సభ ఎన్నికల నామినేషన్ సమయంలో హేమామాలిని తన ఆస్తుల విలువ 123.6 కోట్లుగా ప్రకటించారు. ఆమెకు 122.19 కోట్ల ఆస్తులు, 1.42 కోట్ల అప్పులు ఉన్నాయి. సినిమాలకు దూరంగా ఉన్నా, ప్రకటనలు, వ్యాపారాలు, అద్దెల ద్వారా ఆదాయం పొందుతున్నారు. చెన్నై, ముంబై, పూణే, వృందావన్, జైపూర్ వంటి నగరాల్లో ఆమెకు ఆస్తులు ఉన్నాయి. హేమకు కార్లంటే ఇష్టం. మెర్సిడెస్ బెంజ్, ఆడి Q5, అల్కాజర్, మారుతి ఈకో వంటి కార్లు ఆమె వద్ద ఉన్నాయి.

హేమామాలిని ప్రస్తుతం ఏం చేస్తున్నారు?

హేమామాలిని ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె చివరిగా 2020లో 'షిమ్లా మిర్చి' సినిమాలో నటించారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. హేమ నటి, నిర్మాత, దర్శకురాలు, మంచి నృత్యకారిణి కూడా. 2003లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2003 నుండి 2009 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 2010లో బిజెపి జనరల్ సెక్రటరీ అయ్యారు. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మధుర నుండి గెలిచారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే