అక్కినేని ఫామిలీలో టెన్షన్... టెన్షన్

First Published Dec 11, 2017, 12:29 PM IST
Highlights

అఖిల్ కు  డిసెంబర్ 22 టర్నింగ్ పాయింట్ కానుందా?

అక్కినేని అఖిల్ చిత్రం ‘హలో’ ఆడియో వేడుకయితే నిన్న సాయంత్రం వైజాగ్ ఘనంగా జరిగింది. గొప్పగా ఉందని అంతా చప్పట్లు కొట్టారు. అఖిల్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. దీనిని వెనక చాలా టెన్షన్ ఉంది. ఈ వేడకతో అటెన్షన్ పోయి రిలీఫ్ వస్తుందనుకో లేం.  ఎందుకంటే, ఇది అక్కినేని అఖిల్ రీ లాంచ్ వేడుక. రీలాంచ్ ఎందుకొచ్చింది? 2015లొ వచ్చిన ‘అఖిల్ ’పరాజయం ఎదుర్కొంది.  అప్పటినుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు రెండేళ్లు అఖిల్ బ్రేక్ రాలేదు. అటువైపు మరొక జనరేషన్ దూసుకుపోతున్నపుడు అఖిల్ వెనకబడ్డాడన్నది తండ్రినాగార్జున మీద ఎంత ప్రజర్ తీసుకొచ్చి ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. అందువల్ల ‘హలో’తో ఆయన్ని ఈ సారి వైజాగ్ నుంచ రీ లాంచ్ చేయాల్సి వచ్చింది. స్థలమార్పిడి కలిసొస్తుందేమో. ఈ టెన్షన్ నిన్న  ప్రోగ్రాంలో  కనిపించింది. నాగార్జున అఖిల్ ను రీలాంచ్ చేస్తున్నట్లు ప్రకటించడానికి కారణం అదే. అంతేకాదు, ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించాల్సి వచ్చింది.   వేడుకలో అఖిల్ మాట్లాడుతూ రెండేళ్లు నాకు రిలీజ్ లేకపోయినా అభిమానులు ఎంతగానో సపోర్ట్ చేశారని అన్నారు. హలో తో హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నానని ధీమాగా చెప్పారు.  ఆడియో వేడుక చూశాక అఖిల్ హిట్ కొడతాడనే అనిపించింది.

విక్రమ్ కుమార్ తనను ఎంచుకున్నప్పుడు ఆయనకు కావల్సిన స్థాయిలో తాను లేనని, అయినా తనను తీసుకుని అన్నింటిలో కాన్ఫిడెంట్ గా ఉండేట్టు చేశారని అఖిల్ అనడం చాలా బాగుంది. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతున్నది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ‘హలో’ తో  అఖిల్ కెరీర్ కొత్త మలుపు తిరుగునుంది. డిసెంబర్ 22 కోసం ఎదురుచూద్దాం. నేయియితే ఎఫ్ డిఎఫ్ ఎస్.

 

 

 

 

click me!