
సౌత్ స్టార్ సీనియర్ యాక్టర్ శరత్ బాబు ఆరోగ్యంపై రకరకాల వదంతులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు విని ఆయన అబిమానులు కంగారుపడుతున్నారు. ఇక కొంత మంది ఏకంగా ఆయన మరణించారంటూ సంతాపాలు కూడా తెలిపారు. సీనియర్ హీరోయిన్ కుష్భు శరత్ బాబుకు నివాళి అర్పిస్తూ.. ట్వీట్ చేసి.. అసలు విషయం తెలిసి.. ఆట్వీట్ డిలెట్ చేశారు. ఆతరువాత ఆయన క్షేమంగా ఉన్నారని.. త్వరలో మీడియాతో మాట్లాడుతారని.. శరత్ బాబు సోదరి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. శరత్ బాబు ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. శరత్ బాబు ఆర్గాన్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్నారని కొన్ని రోజుల క్రితం డాక్టర్లు ప్రకటించారు. ఇంతలోనే ఆయన్ను ఐసీయూ నుంచి రూమ్ కు ఎలా మార్చారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. శరత్ బాబుకు ట్రీట్ మెంట్ కొనసాగుతుందని.. ఆయన కండీషన్ ఇంకా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో AIG హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.
కొంత కాలం క్రితం తీవ్ర అస్వస్థతతకు గురైన శరత్ బాబును చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.అక్కడ పరిస్థితి మెరుగు అవ్వకపోవడంతో.. వెంటనే బెంగళూరు కు ఆయన్ను మార్చారు. అక్కడ కోలుకున్ ట్టేకోలుకుని..మళ్లీ సీరియస్ అవ్వడంతో.. వెంటనే హైదరాబాద్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. వారు చెప్పేదాన్ని బట్టి.. అసలు సంగతిపై క్లారిటీ వస్తుంది.
71 ఏళ్ళ శరత్ బాబు దాదాపు 200లకు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో కెరీర్ ను స్టార్ట్ చేసి.. తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో నటించారు. కొన్నాళ్ళు బెంగళూరులో ఉన్న ఆయన.. ఆతరువాత చెన్నైలో స్థిరపడ్డారు. టాలీవుడ్ సీనియర్ మోస్ట్ లేడీ కమెడియన్ రమా ప్రభతో ఆయనకు మొదటి వివాహం జరిగింది. ఆతరువాత కొన్నేళ్లకు వారు విడిపోయారు. ఆతరువాత కూడా రెండు వివాహాలు చేసుకున్నారు శరత్ బాబు. ఆయన చివరి సారిగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించారు.