'కేజీఎఫ్' హీరో ఫ్యామిలీ రెంట్ వివాదం.. నెటిజన్ల ట్రోలింగ్!

Published : Mar 24, 2019, 05:04 PM IST
'కేజీఎఫ్' హీరో ఫ్యామిలీ రెంట్ వివాదం.. నెటిజన్ల ట్రోలింగ్!

సారాంశం

'కేజీఎఫ్' చిత్రంతో అన్ని భాషల్లో ఫేమస్ అయిన నటుడు యష్ ఫ్యామిలీ రెంట్ కట్టడం లేదని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

'కేజీఎఫ్' చిత్రంతో అన్ని భాషల్లో ఫేమస్ అయిన నటుడు యష్ ఫ్యామిలీ రెంట్ కట్టడం లేదని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కోర్టుని ఆశ్రయించిన హీరో గారి ఫ్యామిలీకి షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే.. యష్ ఫ్యామిలీ బనశంకరి ఏరియాలో ఒక ఇంట్లో 2010 నుండి నివాసం ఉంటున్నారు. 

ఇంటి అద్దె రూ.40 వేలు. 2013 నుండి రెంట్ కట్టడం లేదని ఇంటి ఓనర్లు సివిల్ కోర్టుని ఆశ్రయించారు. అయితే యష్ అమ్మగారు పుష్ప మాత్రం ఇంటి నిర్మాణ సమయంలో పన్నెండున్నర లక్షలు చెల్లించామని ఆ కారణంగానే ఇంటికి అద్దె ఇవ్వడం లేదని అంటోంది.

ఇంటి ఓనర్లు మాత్రం కిరాయి చెల్లించాల్సిందేనని అంటున్నారు. ఈ విషయంలో కోర్టు వారు పుష్పకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. దీంతో ఆమె హైకోర్టుని ఆశ్రయించింది. వాదనలు విన్న హైకోర్టు రూ.23 లక్షలు, ఈ మొత్తానికి వడ్డీని కూడా చెల్లించి పుష్ప.. ఇంటి ఓనర్ లకు చెల్లించాలని తీర్పునిచ్చింది. అంతేకాదు పుష్ప రీసెంట్ గా హౌస్ ఎవిక్షన్ నోటీసులు కూడా అందుకున్నారట.

దీంతో ఆమె తనకి ఇంట్లో ఉండడానికి ఎక్స్ టెన్షన్ కావాలని సుప్రీం కోర్టుని ఆశ్రయించారని సమాచారం. మరో పక్క సోషల్ మీడియాలో యష్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. స్టార్ హీరో అయి ఉండి ఈ రెంట్ వివాదాలు ఏంటి అంటూ మండిపడుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ సినిమా ఫ్లాప్ కాబోతోంది.. డోంట్ వర్రీ, నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చింది ఎవరో తెలుసా ?
అల్లు అయాన్ ను ఇప్పటి నుంచే రెడి చేస్తున్న అల్లు అర్జున్, వారసుడికి బన్ని స్పెషల్ ట్రైయినింగ్..