స్టార్ హీరోయిన్ ని వదిలేసిన డైరెక్టర్!

Published : Dec 22, 2018, 10:17 AM IST
స్టార్ హీరోయిన్ ని వదిలేసిన డైరెక్టర్!

సారాంశం

బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తన భార్యతో విడిపోయిన తరువాత స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో ప్రేమాయణం నడిపించినట్లు వార్తలు వచ్చాయి. 

బాలీవుడ్ దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తన భార్యతో విడిపోయిన తరువాత స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో ప్రేమాయణం నడిపించినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని, ఈ విషయం శ్రద్ధా తండ్రి శక్తికపూర్ కి నచ్చక ఆయన గొడవ పెట్టుకున్నాడని ఇలా రకరకాలా ఊహాగానాలు వినిపించాయి.

ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాన్ని పక్కన పెడితే ఈ దర్శకుడు ఇప్పుడు శ్రద్ధాకి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది. ఫర్హాన్.. శ్రద్ధాని వదిలేసి మరో భామతో తిరుగుతున్నాడని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురిస్తోంది.

శివానీ దండేకర్ అనే వీజే, టీవీ హోస్ట్ తో ఫర్హాన్ ప్రేమాయణం సాగిస్తున్నాడు.ఈ విషయాన్ని ఈ జంట పరోక్షంగా అంగీకరించింది. కొన్ని రోజుల క్రితం శివానీ.. ఫర్హాన్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలానే ఈ మధ్య కాలంలో ఇద్దరూ కలిసి బయటతిరగడం మీడియా కెమెరాలకు చిక్కింది.

కొత్త గర్ల్ ఫ్రెండ్ తో సెటిల్ అయిన ఫర్హాన్, శ్రద్ధాని వదిలేశాడని టాక్. ఇక్కడితో శ్రద్ధా, ఫర్హాన్ ల మధ్య రూమర్లకు చెక్ పడినట్లే.. ప్రస్తుతం శ్రద్ధా హీరోయిన్ గా 'సాహో' సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

16 కోట్ల పెంట్‌హౌస్‌లో హీరోయిన్, ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా?
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ