‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుంచి ధనుష్ పాడిన సాంగ్ వచ్చేసింది.. అదిరిపోయిన లిరిక్స్

By Asianet News  |  First Published May 31, 2023, 3:56 PM IST

 నవీన్ పొలిశెట్టి - అనుష్క శెట్టి కలిసి నటించిన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. తాజాగా మూవీ నుంచి మరో క్రేజీ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. యూత్ కు బాగా ఆకట్టుకునేలా లిరిక్స్, ట్యూన్ ఉండటంతో మంచి రెస్పాన్స్  దక్కుతోంది. 


యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)  చివరిగా ‘జాతిరత్నాలు’ చిత్రంతో అలరించిన విషయం తెలిసిందే. దాంతర్వాత మరో ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి  (Anushka Shetty) తో కలిసినటించిన తాజా చిత్రమే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr.Polishetty). మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా యూనిట్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్నారు. పోస్టర్లు, రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. 

మరోవైపు యూనిట్ మ్యూజిక్ పరంగానూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే టీజర్ తో కామెడీ అదిరిపోనుందని తెలియజేశారు. ఇప్పుడు సాంగ్స్ తోనూ ఆకట్టుకుంటోంది యూనిట్. రెండు నెలల కింద ‘నో నో నో’ అనే టైటిల్ లో ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చిత్రం నుండి రెండో పాటను కూడా విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ ను మేకర్స్. తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush)తో పాడించడటం విశేషం. ధనుష్ గతంలో ఎన్నో సాంగ్స్ ని పాడి ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సింగర్ గా ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. 

Latest Videos

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ నుంచి రెండో సాంగ్ ను ‘హత విధి’ (Hathavidi)  అనే టైటిల్ తో విడుదల చేశారు. ఈ లిరికల్ సాంగ్ ను తెలుగు, తమిళంలో రిలీజ్ చేశారు. స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్,కు, ధనుష్ అద్భుతమైన గాత్రం అందించారు. రధన్ క్యాచీ టూన్ తో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ లవర్స్ కు ఈ సాంగ్ బాగా నచ్చుతోంది. ప్రస్తుతం యూట్యూబ్ లోనూ ట్రెండ్ అవుతోంది. లిరికల్ వీడియోలో.. సినిమాలో హీరో తన భవిష్యత్తు తెలుసుకోవాలని ఒక చిలక దగ్గరకు వెళితే ఆ చిలక కూడా పారిపోతుంది. అలా తన లైఫ్ లో ఏదీ గొప్పగా చేయాలనుకున్న అది అనుకున్నట్టు జరగకపోవడం అనే కాన్సెప్ట్ తో సాంగ్ కొనసాగింది. తనకు ఎదురవుతున్న సంఘటనలతో నవీన్ ఎంత నిరుత్సాహానికి లోనవుతాడో అనే విషయాన్ని దర్శకుడు ఈ పాటలో స్పష్టంగా చూపించబోతున్నారని అర్థం అవుతోంది.

ధనుష్ గొంతు, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ తో పాటు  సంగీత దర్శకుడు రధన్ మ్యూజిక్ ఈ సాంగ్ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది. మరో విశేషం ఏమిటి అంటే ఈ సాంగ్ విన్న ప్రతి ఒక్కరు ఈ సాంగ్ కి ఏదో ఒక లిరిక్ దగ్గర తమ లైఫ్ గుర్తు చేసుకోక మానరు. ఇక మూవీలో నవీన్ స్టాండప్ కమెడియన్ గా అలరించబోతున్నారు. అనుష్క చెఫ్ గా కనిపించబోతోంది. వీరిద్దరూ వెర్వేరు దేశాల్లో ఉంటారు. అలాంటప్పుడు వీరి మధ్య  బంధం ఎలా కుదురుతుందనేది సినిమా తెలుస్తోంది. మహేష్ బాబు.పి దర్శకత్వం వహిప్తుండగా యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. 

JaaneJigars song full lyrical video from out now. Lots of surprises from the movie 🔥 Go watch now. Pick your fav moment. Boys Mana paata vachindi darlings ❤️

▶️ https://t.co/NTWVDiHWqW

Sung by one and only sir 🔥🔥…

— Naveen Polishetty (@NaveenPolishety)

 

click me!