Aishwarya Rai Bachchan : ‘బచ్చన్’ హౌజ్ ను వీడుతున్న ఐశ్వర్య రాయ్? బలమైన రూమర్లు.. నిజమేంటీ!?

Published : Dec 15, 2023, 09:31 PM ISTUpdated : Dec 15, 2023, 09:34 PM IST
Aishwarya Rai Bachchan : ‘బచ్చన్’ హౌజ్ ను వీడుతున్న ఐశ్వర్య రాయ్? బలమైన రూమర్లు.. నిజమేంటీ!?

సారాంశం

బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ కొద్దిరోజులుగా రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా మరోసారి అవే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. 

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan)   - అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)  విడిపోతున్నారంటూ కొద్దిరోజులు కింద రూమర్ వ్యాప్తించింది. దీంతో అభిమానులు ఆందోళన పడ్డారు. రీసెంట్ గానే కాకుండా గతంలోనూ పలుమార్లు రూమర్లు వినిపించాయి. వీటిపై ఎప్పుడూ అటు ఐశ్వర్య గానీ, ఇటు అభిషేక్ గానీ స్పందించలేదు. ఫలితంగా సందుకోసారి రూమర్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇటీవల బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కూడా డివోర్స్ ఆలోచనలోనే ఉన్నారంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వేదికగా వ్యక్తపరిచారు. 

అటు బాలీవుడ్ మీడియాలోనూ తెగ వార్తలు వచ్చాయి. దీంతో నిజమేనేమో అనే అనుమానాలూ వ్యక్తం అవుతూ వచ్చాయి. ఇక తాజాగా మరోసారి అవే రూమర్లు ఊపందుకున్నాయి. జయబచ్చన్ తో ఐశ్వర్య రాయ్ పూర్తిగా మాట్లాడటం లేదని, త్వరలోనే ‘బచ్చన్’ హౌజ్ నుంచి వెళ్లిపోతుందంటూ రూమర్లు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో అభిమానులు ఇంకా ఖంగారు పడుతున్నారు. దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ పుకార్లు మాత్ం బలంగా వినిపిస్తున్నాయి. 

కానీ.. తాజాగా ఈ రూమర్లను కొట్టేపారేసే క్లారిటీ కూడా లభించింది. రీసెంట్ గా ఓ ఈవెంట్ కు హాజరైన అభిషేక్, ఐశ్వర్య దూరంగా ఉంటున్నారని, అందుకే వెడ్డింగ్ రింగ్ ను అభిషేక్ తీసేశారని పుకార్లు వచ్చాయి. కానీ తాజాగా వాటన్నింటిని తుడిచిపెట్టేలా ఐశ్వర్య - అభిషేక్ జంటగా కనిపించారు. విడాకుల రూమర్లకు చెక్ పెట్టినట్టూ కనిపిస్తోంది. ఈరోజు కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan)  స్కూల్ ఈవెంట్ కోసం ఇద్దరూ జంటగా హాజరయ్యారు. ఎంతో ప్రేమగా కనిపించారు. అటు అమితాబ్ బచ్చన్ కూడా కొడుకు కోడలితో కలిసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. బాలీవుడ్ స్టార్ కపుల్ అనోన్యంగానే ఉన్నారని ఫ్యాన్స్ తెలుపుతున్నారు. మరో వీడియోలో జయబచ్చన్ తో మాట్లాడటం లేదంటూ కొందరూ చూపిస్తున్నారు. ఏదేమైనా బచ్చన్ ఫ్యామిలీ నుంచి క్లారిటీ వస్తే గానే ఈ రూమర్లకు చెక్ పడేలా లేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌