నిజమే.. పెళ్లయిన నటితో హీరో రిలేషన్‌షిప్‌!

Published : Dec 19, 2018, 08:42 PM ISTUpdated : Dec 19, 2018, 08:45 PM IST
నిజమే.. పెళ్లయిన నటితో హీరో రిలేషన్‌షిప్‌!

సారాంశం

ఖడ్గం సినిమాలో 'ముసుగువేయ్యోద్దు మనసు మీద..' అంటూ కుర్రాళ్ళ ను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న బ్యూటీ కిమ్ శర్మ. అప్పట్లో ఈ బ్యూటీ స్పోర్ట్స్ ప్లేయర్స్ తో డేటింగ్ చేసింది అన్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి.

ఖడ్గం సినిమాలో 'ముసుగువేయ్యోద్దు మనసు మీద..' అంటూ కుర్రాళ్ళ ను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న బ్యూటీ కిమ్ శర్మ. అప్పట్లో ఈ బ్యూటీ స్పోర్ట్స్ ప్లేయర్స్ తో డేటింగ్ చేసింది అన్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే గతంలో కెన్యన్ బిజినెస్ మెన్ ని పెళ్లాడిన కిమ్ అతనితో విభేదాల కారణంగా ఇప్పుడు దూరంగా ఉంటోంది.   

ఇక ఇప్పుడు మరోసారి అమ్మడు తెలుగు నటుడిని బుట్టలో పడేసినట్లు తెలిసిపోయింది. తకిట తకిట సినిమాతో తెలుగు తెరకు పరిచయమిన హర్షవర్ధన్ రాణే రాజమండ్రికి చెందిన కుర్రాడు. తెలుగులో గెస్ట్ రోల్స్ చేస్తూనే బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇకపోతే గతంలో రాణే అండ్ కిమ్ చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంట పడింది. 

అయితే ఎన్ని రూమర్స్ వచ్చినా వాటిపై స్పందించలేదు. ఇక ఫైనల్ గా హర్షవర్ధన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌ పై స్పందించాడు. అవును తామిద్దరం  రిలేషన్‌షిప్‌ ఉన్నామంటూ.. ఇందులో దాయడానికి ఏమి లేదు. తన మంచి కోరుకునేవాడిని కాబట్టి ఇన్ని రోజులు ఈ విషయం గురించి స్పందించలేదని హర్ష జాతీయ మీడియాకు వివరణ ఇచ్చాడు.  

PREV
click me!

Recommended Stories

రికార్డులకు పాతరేసిన మన శంకర వరప్రసాద్ గారు, ఫస్ట్ డే కలెక్షన్స్.. బాలయ్య, వెంకీ, నాగ్ లకు సాధ్యంకాని ఘనత
షాపింగ్ మాల్‌లో ప్రేమ‌, ల‌క్ష‌ల్లో ఒక‌రికి వ‌చ్చే అరుదైన వ్యాధి.. పెద్ది రెడ్డి సింగ‌ర్ జీవితంలో సినిమాను మించిన ట్విస్టులు