హరీష్ శంకర్ లిస్ట్ లో మరో హీరో.. నెక్స్ట్ ఎవరితో?

Published : Sep 14, 2019, 09:13 AM IST
హరీష్ శంకర్ లిస్ట్ లో మరో హీరో..  నెక్స్ట్ ఎవరితో?

సారాంశం

గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయిన దర్శకుడు హరీష్ శంకర్ అప్పటి నుంచి అదే తరహాలో క్రేజ్ అందుకుంటున్నాడు. ఆ తరువాత చేసిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా హరీష్ తో సినిమా అంటే ఎలాంటి హీరో అయినా కథ వినడానికి సిద్ధమవుతున్నారు.

గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయిన దర్శకుడు హరీష్ శంకర్ అప్పటి నుంచి అదే తరహాలో క్రేజ్ అందుకుంటున్నాడు. ఆ తరువాత చేసిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా హరీష్ తో సినిమా అంటే ఎలాంటి హీరో అయినా కథ వినడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు వాల్మీకి రిలీజ్ పనుల్లో బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. 

గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దర్శకుడు ఒకేసారి నలుగురికి పైగా హీరోలకు ఇటీవల కథలు చెప్పినట్లు తెలుస్తోంది. హరీష్ ఇటీవల నెటిజన్స్ తో చిట్ చాట్ చేసినప్పుడు మాత్రం మెగాస్టార్ కి కథను నేరేట్ చేయాలనీ ఉందని చెప్పాడు. అలాగే రామ్ చరణ్ - మహేష్ బాబు వంటి స్టార్స్ తో కూడా వర్క్ చేసే అవకాశం ఉందని చెప్పాడు. దాదాపు ఈ స్టార్స్ కి హరీష్ తాను అనుకున్న స్క్రిప్ట్ లైన్ ను వివరించినట్లు టాక్. 

ఇక హరీష్ లిస్ట్ లో నాని కూడా ఉన్నాడు. నానితో వర్క్ చేసే అవకాశం ఉందని దాదాపు కన్ఫర్మ్ చేసేశాడు. ఇక రీసెంట్ గా నితిన్ కూడా ఈ డైరెక్టర్ లిస్ట్ లోకి వచ్చినట్లు రూమర్  వచ్చింది. అందదున్ రీమేక్ లో నితిన్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హీరో హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ అధినేత అందదున్ రీమేక్ రైట్స్ ను అందుకొని హరీష్ శంకర్ తో మాట్లాడినట్లు సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ప్రకటన వెలువడనున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. మరి హరీష్ శంకర్ నెక్స్ట్ ఎవరితో వర్క్ చేస్తారో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

Kalyan Padala తో వర్కౌట్‌ కాకపోవడంతో డీమాన్‌ పవన్‌ని పట్టుకుంది.. ట్రోల్స్ పై రీతూ చౌదరీ రియాక్షన్‌ ఇదే
BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?