ఈ సినిమా నిమిత్తం హరీష్ శంకర్ కు 15 కోట్లు రెమ్యునేషన్ ముట్టిందని వార్తలు వస్తున్నాయి.
మిస్టర్ బచ్చన్ చిత్రం రవితేజ కేరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. బయ్యర్లకు తొంభై శాతం నష్టాలు మిగిల్చింది. హరీష్ శంకర్ తనను తాను సమర్ధించుకునే పని మొదలుపెట్టినా పెద్దగా ఫలితం లేదు. హీరోయిన్‌ను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారని, కథను బాగా సాగదీశాడని హరీష్ శంకర్‌ను ట్రోల్ చేస్తున్నారు. మీడియా అటెన్షన్‌పై ఉన్న శ్రద్ద సినిమాపై పెడితే బాగుండేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ''మిస్టర్ బచ్చన్'' నెగిటివ్ టాక్ రావడంతో రవితేజ అభిమానులు హరీష్ శంకర్‌పై గుర్రుగా ఉన్నారు. మరో ప్రక్క నిర్మాత...మిస్టర్ బచ్చన్ నష్టాల రికవరీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేఫద్యంలో హరీష్ శంకర్ సైతం తాను నష్టాల రికవరీకు తనవంతు సాయిం చేయటానికి ముందుకు వచ్చారని వార్తలు వస్తున్నాయి.
ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మిస్టర్ బచ్చన్ ఇప్పటిదాకా రాబట్టింది పదమూడు కోట్ల గ్రాస్ మాత్రమే అంటున్నారు. దాంతో షేర్ లెక్కేసి చూస్తే కేవలం ఎనిమిది కోట్ల దాకా తేలుతుంది. అంటే బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే ఇంకో ఇరవై కోట్లకు పైగానే షేర్ రాబట్టాలి. అయితే ఇప్పుడున్న పరిస్దితిలో అది జరిగే పని కాదు. రోజు రోజుకీ కలెక్షన్స్ డ్రాప్ కనపడుతోంది కానీ పికప్ కావటం లేదు. అప్పటికీ పదమూడు నిముషాలు ట్రిమ్ చేసి స్పీడు పెంచినప్పటికీ అది జనాన్ని రప్పించేందుకు సరిపోవడం లేదు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నుంచి నిర్మాతకు ఒత్తిడి ఎదురు అవుతోందిట.
ఈ సినిమా నిమిత్తం హరీష్ శంకర్ కు 15 కోట్లు రెమ్యునేషన్ ముట్టిందని వార్తలు వస్తున్నాయి. నష్టాలు రికవరీ నేపధ్యంలో తన రెమ్యునరేషన్ లోంచి కొంత వెనక్కి ఇవ్వబోతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. అయితే ఇదేమీ కొత్త కాదు. గతంలో హీరోలు, దర్శకులు సినిమా డిజాస్టర్ అయ్యినప్పుడు తమ రెమ్యునరేషన్ లో కొంత త్యాగం చేయాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. నిర్మాత టిజి విశ్వప్రసాద్ ... బయ్యర్లకు నష్టపోయిన మొత్తం ఇస్తానని హామీ ఇచ్చారట. ఇక హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ లో కొంత వెనక్కి ఇస్తారనే వార్త లో నిజమెంత ఉందో కానీ చాలా మంది సోషల్ మీడియాలో ఆయన్ని మెచ్చుకుంటున్నారు. నిర్మాత కష్టం గమనించిన డైరక్టర్ అంటున్నారు.
ఇదిలా ఉంటే హరీష్ శంకర్ ఈ చిత్రం రిజల్ట్ పై రియాక్ట్ అయ్యారు. ''మిస్టర్ బచ్చన్'' సినిమా మేం అనుకున్నంత గొప్ప సినిమా కాకపోవచ్చు. అదే విధంగా మరీ దారుణమైన సినిమా కూడా కాదని హరీష్ శంకర్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ఈ మూవీపై తీవ్రమైన ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. రవితేజ లైఫ్ ఇస్తే , ఆయన లైఫ్‌తోనే హరీష్ శంకర్ ఆడుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీమేక్ సినిమాను ఇలా కూడా తీస్తారా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.