వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూడొద్దు : హరీష్ శంకర్

By AN TeluguFirst Published Sep 21, 2019, 1:51 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్.. కొత్త దర్శకులకు తన అనుభవంతో ఓ సలహా ఇచ్చారు. తాను తెరకెక్కించిన ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఎగ్జాంపుల్‌గా చెప్పారు.
 

వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'వాల్మీకి' సినిమా టైటిల్ ను 'గద్దలకొండ గణేష్' గా మార్చిన సంగతి తెలిసిందే. బోయ సామాజిక వర్గం నుండి వ్యక్తమైన ఆందోళన నేపధ్యంలో సినిమా టైటిల్ ని మార్చారు. 'గద్దలకొండ గణేష్' పేరుతో శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. 

మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. దీంతో చిత్రబృందం వెంటనే సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఇందులో హరీష్ శంకర్ మంచి స్పీచ్ ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీకి ఎన్నో ఆశలతో వచ్చే కొత్త దర్శకులకు ఓ సలహా కూడా ఇచ్చారు. సినిమాలోని ఓ సన్నివేశంలో కోరుకున్న హీరోతో సినిమా చేయలేకపోయినందుకు దర్శకుడు సినిమా నుంచి తప్పుకుంటాడని.. ఇలాంటి ఘటనలు ఇండస్ట్రీలో కూడా కనిపిస్తుంటాయని చెప్పారు. 

ఈ సనివేశాన్ని ఉదాహరణగా తీసుకొని ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. అని మొదలుపెట్టిన హరీష్ శంకర్.. ''ఒక్కోసారి మనకు వచ్చిన అవకాశాన్ని తక్కువగా చూసి వదిలేసుకుంటూ ఉంటాం. ఆ అవకాశాలు మళ్లీ రాకపోవచ్చు. కాబట్టి చిన్న అవకాశమా పెద్ద అవకాశమా అనిచూడకుండా వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వెళ్లిపోవాలి. మనకు నచ్చిన పనిని వేరే పని కోసం వదులకుంటే దాన్ని కాంప్రమైజింగ్ అంటారు. అదే చిన్న మార్పులు చేసుకుని ఆ పనిని పూర్తి చేయగలిగితే దానిని అడ్జస్టింగ్ అంటారు'' అంటూ చెప్పుకొచ్చారు. 

click me!