ఐకాన్ స్టార్ ను డైరెక్ట్ చేస్తున్న హరీశ్ శంకర్.. సెట్స్ లో హంగామా.. ఇంతకీ ఏ ఫిల్మ్?

Published : Jul 28, 2022, 01:55 PM IST
ఐకాన్ స్టార్ ను డైరెక్ట్ చేస్తున్న హరీశ్ శంకర్.. సెట్స్ లో హంగామా.. ఇంతకీ ఏ ఫిల్మ్?

సారాంశం

పవర్ ఫుల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సెట్స్ లో ఇద్దరూ చేస్తున్న హంగామాకు సంబంధించిన పిక్స్ బయటికి వచ్చాయి. 


టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ‘పుష్ఫ : ది రైజ్’ చిత్రంతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో  తెలిసిందే. పుష్ఫ రాజ్ మేనరిజంతో ప్రపంచం మొత్తంగా పాపులారిటీని దక్కించుకున్నాడు. ఈ చిత్రంలో అదిరిపోయే డైలాగ్స్, సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ ఉండటంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం బన్నీ ‘పుష్ఫ : ది రూల్’ (Pushpa : The Rule) చిత్రంలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల నుంది. అభిమానులు, ఆడియెన్స్ కూడా పుష్ఫ సీక్వెల్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

అయితే, అల్లు అర్జున్ తాజాగా పవర్ ఫుల్ డైరెక్టర్  హరీశ్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇంతకీ ఏ ఫిల్మ్ అని ఆలోచిస్తున్నారా? సినిమా కాదులే.. ఓ కంపెనీకి సంబంధించి యాడ్ ఫిల్మ్ కు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా నటిస్తున్నారు. వరల్డ్ క్లాస్ డీవోపీ సుదీప్ ఛటర్జీ కెమెరా బాధ్యతలు చూస్తున్నారు. తాజాగా షూట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సెట్స్ లోకి అల్లు అర్జున్, హరీశ్ శంకర్ ఎంట్రీ ఇచ్చే ఫొటోలు తాజాగా నెట్టిం వైరల్ అవుతున్నాయి. ఇక యాడ్ ఫిల్మ్ అదిరిపోద్దనీ అభిమానులు భావిస్తున్నారు.   

ఇదిలా ఉంటే, ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో ‘పుష్ఫ’ చిత్రమొక్కట్టే ఉంది. పార్ట్ 1 రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా ఇంకా పార్ట్ 2 షూటింగ్ ప్రారంభానికి ముహుర్తం రావడం లేదు. దీంతో బన్నీ పలు యాడ్ షూట్స్ చేస్తూ బిజీ అవుతున్నారు. ఇప్పటికే ‘జోమాటో’,‘ర్యాపిడో’ వంటి యాప్ లకు తెలుగు రాష్ట్రాల వరకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహిరస్తున్నారు. ఇప్పటికే జోమాటో యాడ్ ఫిల్మ్ తెగ వైరల్ అవుతోంది. అల్లు స్టైలిష్ లుక్ అదుర్స్ అనిపించింది. ప్రస్తుతం బన్నీ ‘ఫుష్ఫ ది రూల్’ కోసం సిద్ధం అవుతున్నారు.  దర్శకుడు హరీశ్ శంకర్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్