అమెరికా వెళ్ళిన కమల్ హాసన్, ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన లోకనాయకుడు, ఏం చేయబోతున్నారు..?

Published : Jul 28, 2022, 01:24 PM IST
అమెరికా వెళ్ళిన కమల్ హాసన్, ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన లోకనాయకుడు, ఏం  చేయబోతున్నారు..?

సారాంశం

లోక నాయకుడు కమల్ హాసన్ సడెన్ గా అమెరికా టూర్ వెళ్లారు. అందేంటి ఇంత సడెన్ గా కమల్ అమెరికా వెళ్ళడం ఏంటీ అని ఫ్యాన్స్  షాక్ అవుతున్నారు. కారణం ఏమై ఉంటుందని చర్చించుకుంటున్నారు. అయితే అభిమానుల కోసం కమల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.   

విక్రమ్‌ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో కమల్ హాసన్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు సీనియర్ స్టార్ హీరో. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న సినిమాలు కంప్లీట్ చేయడం కోసం ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నాడు. ఇక దూసుకుపోతాడు కమల్ అనుకుంటున్న టైమ్ లో సడెన్ గా అమెరికా టూర్ వెళ్లాడు స్టార్ హీరో. అంతే కాదు అమెరికాలో దాదాపు మూడు వారాల పాటు ఉండబోతున్నాడట కమల్. మరి ఇక్కడ కమిట్ అయిన సినిమాల పరిస్థితి ఏంటీ..?  

విక్రమ్  హిట్‌ తో మరింత ఉత్సాహంగా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టాడు కమల్. ఎంత  వీలైతే అంత  త్వరగా పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు కమల్ హాసన్. ముందుగా ఆయన పెండ్డింగ్ లో పెట్టిన ఇండియన్2 ను మళ్లీ మోదలెట్టాలి అనే ఆలోచనలో ఉన్నాడు.  గతంలో కొన్ని కారణాల వల్ల ఈ మూవీ దాదాపు 30 శాతం షూటింగ్ చేసుకున్న తరువాత ఆగిపోయింది. ఇక ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడ. ఈసినిమా త్వరలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అవ్వక పోయినా.. ఇండియన్ 2 కూడా స్టార్ట్ చేసి.. రెండు సినిమాలు ఒకేసారి చేస్తారట శంకర్. 

ఇక  అందులో భాగంగానే శంకర్‌ దర్శకత్వంలో చేయనున్న ఇండియన్‌ 2 సినిమా కోసం మేకోవర్‌ అయ్యేందుకు అమెరికా వెళ్లారు కమల్‌హాసన్‌.మూడు వారాల పాటు యూఎస్‌లోనే ఉండి, ఈ సినిమాకి తగ్గట్టు తన ఫిజిక్‌ని మార్చుకోనున్నారని టాక్‌. తన కొత్త లుక్ తో కమల్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారట. ఎవరూ ఉహించని విధంగా ఆయన లుక్ ఉంటుందని టాక్ నడుస్తోంది. కమల్‌-శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ఇండియన్‌,  1996 లో తెలుగులో భారతీయుడు టైటిల్ తో  రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు2 ను రూపొందిస్తున్నారు. 

2020లో ఇండియన్-2 మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.  అయితే కరోనాతో పాటు..  సెట్స్‌లో జరిగిన కొన్ని ప్రమాదాలు, నిర్మాతలో దర్శకుడు శంకర్ కు వచ్చిన విభేదాలు కారణంగా.. ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడింది. కమల్‌హాసన్‌ అమెరికా నుంచి రాగానే సెప్టెంబరులో ఇండియన్‌ 2 మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు  అంతా సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో కాజల్ హీరోయిన్ గా      చేసి మధ్యలో డ్రాప్ అయ్యింది. మరి ఇప్పుడు ఆమె ఓ బాబు కు జన్మనిచ్చింది. మళ్ళీ ఈ సినిమాలో చేస్తుందా..? లేక ఇంకా ఏవరినైనా తీసుకుంటారా అనేది చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?