`హరిహర వీరమల్లు` మూవీ టైటిల్‌ వెనుక స్టోరీ ఇదే, లీక్‌ చేసిన డైరెక్టర్‌

Published : May 21, 2025, 06:59 PM IST
harihara veeramallu, jyothi krishna

సారాంశం

`హరిహర వీరమల్లు` సినిమా నుంచి మూడో పాట వచ్చి ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా సినిమా టైటిల్‌ వెనుక ఉన్న అర్థాన్ని, సినిమా స్టోరీని బయటపెట్టాడు దర్శకుడు జ్యోతికృష్ణ. 

పవన్‌ కళ్యాణ్‌ ప్రతిష్టాత్మకంగా నటించిన చిత్రం `హరిహర వీరమల్లు`. మొదటిసారి పవన్‌ ఇలాంటి హిస్టారికల్ మూవీస్‌ చేస్తున్నారు. యోధుడు వీరమల్లుగా ఆయన ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ మూవీకి ఆయన కొడుకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. 

క్రిష్‌ జాగర్లపూడి మొదటి దర్శకుడు. ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. మూడో పాటని బుధవారం విడుదల చేశారు. `అసుర హననం` అంటూ సాగే పాట అదిరిపోయింది. పవన్‌ పాత్ర తీరుతెన్నులను, సినిమా కథని ప్రతిబింబించేలా ఈ పాట సాగింది.

`హరిహర వీరమల్లు పార్ట్ 1ః స్వార్డ్ వర్సెస్‌ స్పిరిట్‌` టైటిల్‌ వెనుక స్టోరీ

ఈ పాట విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో దర్శకుడు జ్యోతికృష్ణ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. `హరిహర వీరమల్లు` సినిమా టైటిల్‌ వెనుక స్టోరీని వెల్లడించారు. ఈ మూవీకి `హరిహర వీరమల్లు పార్ట్ 1ః స్వార్డ్ వర్సెస్‌ స్పిరిట్‌` అనేది పూర్తి టైటిల్‌. ఇందులో `స్వార్డ్ వర్సెస్‌ స్పిరిట్‌` అనేది క్యాప్షన్‌. 

ఈ క్యాప్షన్‌ వెనుక కథని బయటపెట్టాడు దర్శకుడు. స్వార్డ్ అంటే ఖడ్గం, ఇందులో బాబీ డియోల్ పాత్రని అది ప్రతిబింబిస్తుందని, స్పిరిట్‌ అంటే ధైర్యం. పవన్‌ కళ్యాణ్‌ పాత్ర దాన్ని ప్రతిబింబిస్తుందని, వీరిద్దరి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా అని, అదే ఈ చిత్ర టైటిల్‌ వెనుక ఉన్న అర్థం అని తెలిపారు దర్శకుడు.

పవన్‌ కళ్యాణ్‌ని డైరెక్ట్ చేయడం అవార్డుతో సమానం

ఆయన ఇంకా మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయాలనేది ప్రతి ఒక్క దర్శకుడి కల. ఆ ఛాన్స్ రావడం అవార్డుతో సమానం. నాకు ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. మొదట ఈ ప్రాజెక్ట్ కి పెద్ద పునాది వేసింది దర్శకుడు క్రిష్. దానిని పెద్ద స్థాయికి తీసుకెళ్ళాలని నాన్న(ఏఎం రత్నం) ప్లాన్‌ చేశారు. 

ఇంత పెద్ద బాధ్యతను ఒలింపిక్ టార్చ్ లాగా క్రిష్ నాకు అందించి ముందుకు తీసుకెళ్ళమని చెప్పారు. పవన్ కళ్యాణ్ ని, నాన్నని మెప్పించడం మామూలు విషయం కాదు. అలాంటిది ఆ ఇద్దరూ మెచ్చారంటే.. ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయి స్పందన సొంతం చేసుకోబోతుందో మీరే ఊహించుకోవచ్చు.

కత్తికి ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే `హరిహర వీరమల్లు` కథ

కీరవాణితో పని చేయడం గర్వంగా ఉంది. ఆయన అందరినీ ప్రోత్సహిస్తారు. రాంబాబుకి సందర్భం చెప్పి, పాట రాయించుకొని కీరవాణి కలిస్తే.. సాహిత్యం బాగుందని మెచ్చుకున్నారు. నన్ను కూడా ఎంతో ప్రోత్సహించారు. 

ఓ వైపు ప్రజాసేవ, మరోవైపు ఇచ్చిన మాట కోసం సినిమాలు చేస్తూ విశ్రాంతి తీసుకోకుండా పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమిస్తున్నారు. ఒక గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో నాన్నగారు మొదటి సినిమా నిర్మాతలా ఈ సినిమా కోసం పని చేశారు. కత్తికి, ధర్మానికి మధ్య జరిగే యుద్ధమే ఈ కథ` అని వెల్లడించారు జ్యోతికృష్ణ.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?
Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం