పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే అదిరిపోయే ట్రీట్‌.. పూనకాలకు సిద్దమవుతున్న అభిమానులు..

Published : Aug 31, 2022, 09:55 AM IST
పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే అదిరిపోయే ట్రీట్‌.. పూనకాలకు సిద్దమవుతున్న అభిమానులు..

సారాంశం

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తన ఫ్యాన్స్ కి పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. తాను నటిస్తున్న `హరిహర వీరమల్లు` చిత్రం నుంచి బిగ్‌ సర్‌ప్రైజ్‌ ని రెడీ చేస్తున్నారు. అదిరిపోయే ట్రీట్‌ రాబోతుంది.   

పవన్‌ కళ్యాణ్‌(Pawan kalyan) చివరగా `భీమ్లా నాయక్‌`లో మెరిశారు. ఆ తర్వాత ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. చాలా కాలంగా చిత్రీకరణ దశలో ఉన్న `హరిహర వీరమల్లు`(Harihara Veeramallu) చిత్రం ఎప్పుడు షూటింగ్‌ జరుగుతుందో తెలియని అయోమయం. పవన్‌ షూటింగ్‌ల్లో పాల్గొంటాడా? రాజకీయాల్లో బిజీ నేపథ్యంలో సినిమాలు మానేస్తాడా? అనే అనుమానాలు అభిమానులను వెంటాడుతున్నాయి. ఎలాంటి అప్‌డేట్‌ లేకపోవడంతో నిరాశలో ఉండిపోయారు. 

ఈ నేపథ్యంలో పవన్‌ కళ్యాణ్‌(Pawan kalyan Birthday) బర్త్ డేకి `హరిహర వీరమల్లు` నుంచి అప్‌డేట్‌ రెడీ చేసింది యూనిట్‌. పవన్‌ అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. తాజాగా ఆ విషయాన్ని ప్రకటించారు. పవర్‌ స్టార్‌ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్‌ 2 `పవర్‌ గ్లాన్స్` పేరుతో ఓ వీడియోని విడుదల చేయబోతున్నారట. శుక్రవారం సాయంత్రం 5.45గంటలకు `పవర్‌ గ్లాన్స్`ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. మాసివ్‌ జాతరకి సిద్దం కండి అంటూ పేర్కొంది. 

అందులో భాగంగా ఈ చిత్రంలోని యాక్షన్‌ కట్‌ని వీడియో రూపంలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. పవన్‌ ఫుల్‌ యాక్షన్‌ సన్నివేశాలను చూపించబోతున్నారు. దీంతో సినిమాపై హైప్‌ని మరింత పెంచే ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. అలాగే ఇప్పటికే దాదాపు అరవై శాతం సినిమా చిత్రీకరణ పూర్తయ్యిందని తెలుస్తుంది. సెప్టెంబర్‌ మొదటి వారంలో తిరిగి చిత్రీకరణ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. 

ఇక క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏ ఎంరత్నం, ఏ దయాకర్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో పవన్‌.. వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌