
ఈ నేపథ్యంలోనే హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేశారు. పవన్ కెరీర్‌లో తొలిసారిగా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించారు. అనేక మార్లు వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ చివరకు పూర్తయింది. చివరి రెండు రోజుల చిత్రీకరణకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనిపై చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సెట్లో పవన్ కళ్యాణ్‌తో ఉన్న టెక్నికల్ టీం సభ్యుల ఫోటో సోషల్ మీడియాలో షేర్ కావడంతో, అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్నో ఎదురు చేస్తున్న క్షణం వచ్చేసిందని ఖుషీ అవుతున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరగా ముగించేందుకు టీం శరవేగంగా కృషి చేస్తోంది.
మే 30 లేదా జూన్ రెండో వారంలో ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశముందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అదే సమయంలో, ట్రైలర్‌ను కూడా త్వరలో విడుదల చేయనున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ట్రైలర్ రిలీజ్ సందర్భంగా సినిమా విడుదల తేదీని అధికారికంగా వెల్లడించనున్నారు.
జ్యోతి కృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్, బాబీ డియోల్, నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు, పవన్ త్వరలోనే తన తదుపరి ప్రాజెక్ట్ OG షూటింగ్‌లో పాల్గొననున్నట్టు సమాచారం.