ట్రెండింగ్ లో బాయ్ కాట్ ఆదిపురుష్... టెన్షన్ లో మేకర్స్!

By Sambi ReddyFirst Published Oct 4, 2022, 6:04 PM IST
Highlights

ఆదిపురుష్ టీజర్ పెద్ద చిచ్చు రాజేసింది. దేశవ్యాప్తంగా ఈ మూవీపై వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రామాయణ గాథను వక్రీకరించారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో బాయ్ కాట్ ఆదిపురుష్ అంటూ నెటిజెన్స్ ట్రెండ్ చేస్తున్నారు. 
 

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ఆదిపురుష్ వివాదాల్లో చిక్కుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రామాయణగాథగా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ టీజర్ విమర్శల పాలవుతుంది. మూవీలోని ప్రధాన పాత్రలు రాముడు, రావణాసురుడి గెటప్స్ పూర్తి భిన్నంగా ఉన్న నేపథ్యంలో హిందూ వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ పార్టీ నాయకులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఆదిపురుష్ చిత్రాన్ని అడ్డుకుంటామంటున్నారు. 

రావణాసురుడు పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ గెటప్ ని వారు తప్పుబడుతున్నారు. శివ భక్తుడైన రావణుడుకి నుదుటిపై అడ్డ నామం లేదు. ఆయన వాహనాన్ని కూడా తప్పుగా చూపించారు. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీని సైఫ్ తలపించాడు.ప్రభాస్ రాముడు లుక్ లో కూడా లోపాలు ఉన్నాయనేదివారి ప్రధాన ఆరోపణ. కెజిఎఫ్ ఫేమ్ నటి మాళవిక ఆదిపురుష్ టీజర్ పై అసహనం వ్యక్తం చేశారు. బాలీవుడ్ దర్శకులు రామాయణాన్ని వక్రీకరిస్తున్నారని ఏకి పారేశారు. 

ఆదిపురుష్ మూవీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కాగా... నెటిజెన్స్ బాయ్ కాట్ ట్రెండ్ స్టార్ట్ చేశారు. ట్విట్టర్ లో ఈ నెగిటివ్ ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండ్ అవుతుంది. ఈ పరిణామాలు మేకర్స్ ని భయపెడుతున్నాయి. ఈ మధ్య విడుదలైన అనేక బాలీవుడ్ చిత్రాలు ఈ బాయ్ కాట్ ట్రెండ్ కి బలయ్యాయి. మరోవైపు ప్రభాస్ వరుస ప్లాప్స్ లో ఉన్నారు. ఏదైనా తేడా కొడితే ఆయనకు హ్యాట్రిక్ పూర్తి అవుతుంది.

మొత్తంగా ఆదిపురుష్ కి ఆరంభం ఏమీ బాగోలేదు. అన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. ఆదిపురుష్ విజువల్స్ లో ఏమాత్రం ప్రమాణాలు లేవు. కార్టూన్ మూవీని తలపిస్తున్న ఆదిపురుష్ నెగిటివిటీ మూటగట్టుకుంది. ఇన్ని అవరోధాలను అధిగమించి ప్రభాస్ హిట్ కొట్టడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. 
 

click me!