నేను పాలిటిక్స్ కి దూరంగా ఉంటేనే పవన్ కి మేలు... జనసేనకు మద్దతుపై చిరు కామెంట్!

By Sambi ReddyFirst Published Oct 4, 2022, 5:27 PM IST
Highlights

జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు ఉంటుందా లేదా? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. అయితే ఈ విషయంపై ఫైనల్ గా చిరంజీవి తేల్చేశారు.

గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న చిరంజీవికి పాలిటిక్స్ సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు ఉంటుందా? లేదా అనే విషయంపై ఆయన ఓపెన్ అయ్యారు. పూర్తి స్పష్టత ఇవ్వకున్నప్పటికీ చిరంజీవి తన అభిప్రాయం తెలియజేశారు. రాజకీయాలకు దూరంగా నేను ఇలా సైలెంట్ గా ఉండటమే పవన్ కళ్యాణ్ కి మేలు చేయొచ్చని ఆయన అన్నారు. ఎందుకంటే పాలిటిక్స్ లో నేనొక వైపు తానొకవైపు ఉండటం సరికాదు. నా నిష్క్రమణ పవన్ నాయకుడిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. 

జనసేనకు స్ట్రాంగ్ గా నా మద్దతు తెలపలేదు. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను.  ఎందుకంటే పవన్ నా తమ్ముడు. నిబద్ధత, ఆశయాలు కలిగిన అలాంటి నాయకుడు రావాలని కోరుకుంటాను. పవన్ ఇంత వరకు పొల్యూట్ కాలేదు. కాబట్టి ప్రస్తుతానికి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక గాడ్ ఫాదర్  సినిమాలో ప్రస్తుత రాజకీయాలను ప్రస్తావించలేదని, సినిమాలో ఉన్న డైలాగ్స్ మాత్రమే చెప్పానని, వెల్లడించారు. 

గాడ్ ఫాదర్ మూవీలో చిరంజీవి చెప్పిన ఓ డైలాగ్ వైసీపీ ప్రభుత్వం గురించే అని ప్రచారం జరుగుతున్న క్రమంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. కాగా పొలిటికల్ గా చిరంజీవి, పవన్ వి విరుద్ధ స్వభావాలు. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని పవన్ తప్పుబట్టారు. ఓపెన్ గానే అన్నపై అసహనం ప్రదర్శించారు. 2014 లో జనసేన పార్టీ ఏర్పాటు చేయగా, చిరంజీవి ఎన్నడూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. మద్దతు ప్రకటించలేదు. 

click me!