SSE Side B : ఓటీటీలోకి వచ్చిన రక్షిత్ రెడ్డి ‘సప్త సాగరాలు దాటి సైడ్ - బీ’.. ఎక్కడ చూడాలంటే?

Published : Jan 27, 2024, 11:52 AM IST
SSE Side B  : ఓటీటీలోకి వచ్చిన రక్షిత్ రెడ్డి ‘సప్త సాగరాలు దాటి సైడ్ - బీ’.. ఎక్కడ చూడాలంటే?

సారాంశం

కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టి Rakshith Shetty  మంచి కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన నటించిన రొమాంటిక్ డ్రామా ఓటీటీలో సందడి చేస్తోంది.   

కన్నడ హీరో రక్షిత్ శెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యారు. 777 చార్లీ మూవీతో ఆడియెన్స్ అందరికీ కంటతడి పెట్టించారు. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ కూడిన నటనతో  ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. దాంతో ఆయన సినిమాలకు మంచికి క్రేజ్ ఏర్పడింది. ఇక ఆ వెంటనే రొమాంటిక్ డ్రామా ‘సప్త సాగరాలు దాటి సైడ్ -ఏ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

మొదటి భాగం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ డ్రామాతో ఆడియెన్స్ హృదయాలను హత్తుకునేలా చేసింది సినిమా. దీంతో ఆడియెన్స్ సైడ్ -B ఎప్పుడని ఎదురుచూస్తున్నారు. కన్నడలో ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’ Sapta Sagaradaache Ello Side Bగా వచ్చిన ఈ చిత్రం తెలుగులో ‘సప్తసాగరాలు ధాటి సైడ్ -బీ’ గా వచ్చింది. 

గతేడాది వచ్చిన ఉత్తమ కన్నడ చిత్రాలలో ఇదొకటి. హేమంత్ ఎమ్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబర్ 17న థియేటర్లలోకి వచ్చింది. ఇక పార్ట్ - బీ జనవరి 25 రాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో SSE సైడ్ - B  విడుదలైంది. ఓటీటీ ఆడియెన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. 

Sapta Sagaradaache Ello - Side Bలో రక్షిత్ శెట్టి పోషించిన పాత్ర తన ప్రేమను వెతుక్కుంటూ వెళ్తాడు. మరోవైపు కథనాయిక ప్రియ (రుక్మిణి వసంత్ పోషించినది) కోవిడ్-19 మహమ్మారి కారణంగా తన భర్త తన వ్యాపారాన్ని కోల్పోతాడు. దాంతో  ప్రియ సంతోషంగా లేదని, ఆమెకు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అతను తెలుసుకుంటాడు. మను ప్రియకు సహాయం చేయడానికి ఎలా ప్రయత్నిస్తాడు అనేది సైడ్-బీ సారాంశం. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, చైత్ర జె ఆచార్, అచ్యుత్ కుమార్, రమేష్ ఇందిర పలువురు ప్రముఖ పాత్రలు పోషించారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌