వరుస డిజాస్టర్స్.. ఈసారి నమ్మేదెవరు హను?

Published : Dec 25, 2018, 03:15 PM IST
వరుస డిజాస్టర్స్.. ఈసారి నమ్మేదెవరు హను?

సారాంశం

జయాపజయాలతో  సంబంధం లేకుండా కొత్త తరహా కథలను ఎంచుకోవడంతో దర్శకులను నమ్మి  నిర్మాతలు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే టేకింగ్ కి వచ్చేసరికి వారు ఫెయిల్ అవుతున్నారని సినిమా రిలీజ్ తరువాత తెలుస్తోంది. 

జయాపజయాలతో  సంబంధం లేకుండా కొత్త తరహా కథలను ఎంచుకోవడంతో దర్శకులను నమ్మి  నిర్మాతలు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అయితే టేకింగ్ కి వచ్చేసరికి వారు ఫెయిల్ అవుతున్నారని సినిమా రిలీజ్ తరువాత తెలుస్తోంది. ఇప్పుడు హను రాఘవపూడి పరిస్థితి కూడా  అలానే మారింది. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హను ఆ తరువాత కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో ఇండిస్త్రిని ఆకర్షించాడు. 

అయితే ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్దగా లాభాలను అందించలేదు. ఇక గత ఏడాది వచ్చిన లై సినిమా నిర్మాతలను నిండా ముంచేసింది. నితిన్ మార్కెట్ కు మించి బడ్జెట్ పెట్టడంతో సినిమాకు ఏ మాత్రం లాభాలు రాలేదు. ఇక ఇప్పుడు శర్వానంద్ - సాయి పల్లవి తో తెరకెక్కించిన పడి పడి లేచే మనసు కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది. వారి మార్కెట్ పరిధులను మించి హను సినిమాకు భారీగా ఖర్చు చేయించాడు. 

ఈ దర్శకుడి కాన్సెప్ట్ లను సినీమావాళ్లు బాగానే నమ్ముతున్నారు గాని చాలా వరకు జనాలకు నచ్చట్లేదు. అయితే ఇప్పటివరకు హను రాఘవపూడి చేసిన సినిమాల్లో ఏది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సునామి సృష్టించలేదు. మరి అవకాశాలను అతను ఎలా దక్కించుకుంటున్నాడో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద మిస్టరీగా మారింది. బన్ని లాంటి హీరో కూడా ఇతనితో వర్క్ చేయడానికి తెగ ఇష్టపడుతున్నాడు. ఇక పడి పడి లేచే మనసు టోటల్ రిజల్ట్ తరువాత ఈ సారి హను ఎవరిని నమ్మిస్తాడో చూడాలి?

PREV
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం