బద్రి బ్యూటీపై చీటింగ్ కేసు!

Published : Feb 17, 2019, 11:55 AM IST
బద్రి బ్యూటీపై చీటింగ్ కేసు!

సారాంశం

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ మరోసారి వార్తల్లో నిలిచింది. ముగిసిందనుకున్న వివాదం రెండేళ్ళ అనంతరం మళ్ళీ తెరపైకి వచ్చింది. చీటింగ్ కేసులో కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆమెకు నోటీసులు అందాయి. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అమీషా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 

బద్రి - నాని వంటి సినిమాలతో ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అసలు విషయంలో వస్తే.. 2016 లో ఉద్దరప్రదేశ్ లోని రెస్టారెంట్ ఈవెంట్ లో డ్యాన్స్ చేసేందుకు ఒప్పుకున్నా అమీషా అనుకున్న సమయానికి రాలేదు. 11 లక్షలు అడ్వాన్స్ గా తీసుకొని మోసం  తీసుకున్నట్లు ఈవెంట్ మేనేజర్ పవన్ శర్మ ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వేడుక సమయానికి రావాలంటే 2 లక్షలు అదనంగా ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారని చెప్పారు. 

ఇక ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేయమని అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నట్లు పవన్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అమీషా తో పాటు ఆమె సన్నిహితులపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మార్చ్ 12లోగా కోర్టులో హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే
Border 2 collections: బార్డర్ 2 ఫస్ట్ డే వసూళ్లు, `ధురంధర్‌` రికార్డు బ్రేక్‌.. సన్నీ డియోల్ మూవీ కలెక్షన్ల సునామీ