చిరంజీవి చేతుల మీదుగా జిమ్నాస్టిక్ బుద్దా అరుణా రెడ్డికి కారు గిఫ్ట్

Published : Dec 22, 2021, 08:48 PM IST
చిరంజీవి చేతుల మీదుగా జిమ్నాస్టిక్ బుద్దా అరుణా రెడ్డికి కారు గిఫ్ట్

సారాంశం

జూబ్లీ హిల్స్ లో కియా సోనెట్‌ కారుని ఆయన బహుమతిగా ఇచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా ఈ గిఫ్ట్ ని జిమ్నాస్టిక్స్ బుద్దా అరుణారెడ్డికి అందజేయడం విశేషం. 

ఇంటర్నేషనల్‌ జిమ్నాస్టిక్స్ వేదికపై సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారిణి బుద్దా అరుణారెడ్డికి(Buddha Aruna Reddy) ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ దక్కింది. ఆమెకి మాజీ బీసీసీఐ జూనియర్‌ సెలక్షన్ కమిటీ చైర్మెన్‌ ఛాముండేశ్వరనాథ్‌ కియాకారుని గిఫ్ట్ ని అందించారు. జూబ్లీ హిల్స్ లో కియా సోనెట్‌ కారుని ఆయన బహుమతిగా ఇచ్చారు. అయితే మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) చేతుల మీదుగా ఈ గిఫ్ట్ ని జిమ్నాస్టిక్స్ బుద్దా అరుణారెడ్డికి అందజేయడం విశేషం. చిరంజీవి, కాకినాడ పోర్ట్ చైర్మెన్‌ కేవీ రావులు కలిసి సంయుక్తంగా కారు కీని అరుణారెడ్డికి అందజేశారు. 

ఇదిలా ఉంటే ఇటీవల మోకాలి సర్జరీ నుంచి కోలుకున్న అరుణా ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్ లో స్వర్ణ పతకాలు సాధించారు. అంతకు ముందు ఆమె 2018లో ప్రపంచ జిమ్నాస్టిక్‌ ఛాంపియన్‌ షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. మోకాలి సర్జరీ జరిగిన తర్వాత ఇటీవలే ఆమె మళ్లీ క్రీడల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. 25ఏళ్లలోనే అరుణ పలు అరుదైన రికార్డులు నెలకొల్పడం విశేషం. ఈజిప్ట్‌ కైరోలో మంగళ మంగళవారం ముగిసిన ఫారోస్‌ కప్‌ ఇంటర్నేషనల్‌ ఆర్టిస్టిక్స్ టోర్నీలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. హోరాహోరిగా సాగిన వాల్ట్ ఫైనల్లో అరుణ 13.487 స్కోర్‌తో టాప్‌ ప్లేస్‌ సాధించింది. 0.04 తేడాతో గోల్డ్ కైవలం చేసుకోవడం విశేషం. 

 ఫ్లోర్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో అరుణ 12.37 స్కోరుతో టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌తో ఇంకో గోల్డ్‌‌‌‌‌‌‌‌ ఖాతాలో వేసుకుంది. 2018 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ నెగ్గి హిస్టరీ క్రియేట్​ చేసిన అరుణ 2019 నవంబర్‌‌‌‌‌‌‌‌లో మోకాలికి సర్జరీ కావడంతో చాలా రోజులు ఆమె ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. చిరంజీవి చేతుల మీదుగా కారుని గిఫ్ట్ గా అందుకోవడం పట్ల అరుణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని ఆమె తెలిపారు. ఈ సందర్బంగా కారుని గిఫ్ట్ గా ఇచ్చిన ఛాముండేశ్వరనాథ్‌కి ధన్యవాదాలు తెలిపింది బుద్దా అరుణారెడ్డి. 

ఇక Chiranjeevi ప్రస్తుంత `ఆచార్య` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కాబోతుంది. దీంతోపాటు `గాడ్‌ఫాదర్‌`, `భోళాశంకర్‌`, అలాగే బాబీ దర్శకత్వంలో `మెగాస్టార్‌154` చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఇప్పుడు ఈ డిసెంబర్‌ నెలలో చిత్రీకరణ జరుపుకుంటుండటం విశేషం. ఇలా ఒకే నెలలో నాలుగు సినిమాల్లో నటిస్తున్న స్టార్‌ హీరోగా చిరంజీవి సంచలనం సృష్టించారని చెప్పొచ్చు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్