
జివి ప్రకాష్, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం -సర్వం తాళమయం. రాజీవ్‌మీనన్ తెరకెక్కించిన చిత్రం మార్చి 8న విడుదలవుతోంది. ఫిబ్రవరి 1న తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు అదే పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరూ ఇక్కడ ఆ ట్రైలర్ ని చూడవచ్చు.
వాయిద్యాలు తయారు చేసే కులంలో పుట్టిన పీటర్ జాన్సన్ అనే ఓ సాధారణ యువకుడు సంగీత నేర్చుకోవడానికి ఏం చేశాడు? ఎవరెవరిని కలిశాడు? ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నాడన్న నేపథ్యంతో ‘సర్వం తాళమయం’ తెరకెక్కింది. ఎప్పటికైనా ప్రపంచం మెచ్చే సంగీత విద్వాంసుడు కావాలన్నది అతడి కల. మరి ఆ కలను ఎలా సాకారం చేసుకున్నాడనేదే మిగతా కధ.
దర్శకుడు రాజీవ్‌మీనన్ మాట్లాడుతూ ..సంగీత విభాగంలో గురుశిష్యుల అనుబంధం, గెలుపోటముల అంశాన్ని ఇతివృత్తంగా చేసుకున్నాం. ఉమయాళ్‌పురం శివరామన్ మీద డాక్యుమెంటరీ చేస్తున్న టైంలో వచ్చిన ఒక ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది అన్నారు. మృదంగం తయారు చేసే వ్యక్తి, ఆ సంగీత పరికరంపై విద్వాంసుడు కావలనిపిస్తే.. అన్న కోణంలో కథ సాగుతుంది అన్నారు. కథను రక్తికట్టించేందుకు జివి ప్రకాష్ మృదంగం నేర్చుకుంటే, సుమేష్ నారాయణ్, బాంబే జయశ్రీలాంటి సంగీతకారులనే పాత్రధారులు చేసుకున్నానన్నారు.
మైండ్ స్క్రీన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ పతాకంపై లతా మేనన్ నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.