షూటింగ్ నుండి పారిపోయిన హీరో, హీరోయిన్!

Published : Oct 05, 2018, 10:09 AM IST
షూటింగ్ నుండి పారిపోయిన హీరో, హీరోయిన్!

సారాంశం

సినిమాలలో హీరోలు వంద మంది రౌడీలు వచ్చినా.. ఒంటి చేత్తో ఎత్తి పక్కన పడేస్తారు. రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటారా అనుకుంటే పొరపాటే.. తాజాగా ఓ హీరో తనకు ఎదురొచ్చిన రౌడీలను ఎదుర్కోలేక షూటింగ్ నుండి పారిపోయాడు. 

సినిమాలలో హీరోలు వంద మంది రౌడీలు వచ్చినా.. ఒంటి చేత్తో ఎత్తి పక్కన పడేస్తారు. రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటారా అనుకుంటే పొరపాటే.. తాజాగా ఓ హీరో తనకు ఎదురొచ్చిన రౌడీలను ఎదుర్కోలేక షూటింగ్ నుండి పారిపోయాడు.

నటుడు జీవీ ప్రకాష్, అబర్నతి కలిసి తమిళంలో 'జైల్' అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కన్నంగి నగర్ ప్రాంతంలో జరుగుతోంది. ఆ ప్రాంతానికి రౌడీ ఏరియా అనే పేరు ఉంది. తరచూ అక్కడ ఏదోక గొడవ జరుగుతూనే ఉంటుంది.

తాజాగా నటుడు జీవీ ప్రకాష్, అబర్నతి షూటింగ్ లో ఉండగా.. అక్కడకి కొందరు వ్యక్తులు వేట కొడవల్లతో ఒక్కసారిగా దూసుకు వచ్చారట. దాంతో షాక్ అయిన చిత్రయూనిట్ వెంటనే అక్కడ నుండి పరుగులు పెట్టారని తెలుస్తోంది. హీరో, హీరోయిన్ షూటింగ్ నుండి పారిపోయి కొంతదూరం వెళ్లి ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం. పరిస్థితులు సద్దుమణిగిన తరువాత బయటకి వచ్చినట్లు తెలుస్తోంది.  

PREV
click me!

Recommended Stories

చిరంజీవితో కలిసి 15 చిత్రాల్లో నటించింది.. కానీ చుక్కలు చూపించింది.! ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే
Gunde Ninda Gudi Gantalu Today 12 డిసెంబర్ ఎపిసోడ్: నీకు ముందే పిల్లలు ఉన్నారా? రోహిణిపై మీనా అనుమానం, ప్రభావతి తిక్క కుదర్చడానికి సుశీలమ్మ ఎంట్రీ...