ముంబైలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. పాల్గొన్న ఆదిత్య థాక్రే, బాలీవుడ్ సింగర్ షాన్

Published : Apr 20, 2022, 06:27 PM IST
ముంబైలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. పాల్గొన్న ఆదిత్య థాక్రే, బాలీవుడ్ సింగర్ షాన్

సారాంశం

తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ముంబైకి కూడా పాకింది. అంతేకాదు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి గొప్ప గౌరవం కూడా దక్కింది. 

తెలంగాణ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ముంబైకి కూడా పాకింది. అంతేకాదు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి గొప్ప గౌరవం కూడా దక్కింది. దేశంలోనే గొప్ప సంగీత దర్శకుడు, కీర్తిశేషులు పద్మవిభూషణ్ ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ సంస్మరణ వేడుకల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని నిర్వహించారు. 

ముంబయి బాంద్రా వెస్ట్ లో జరిగిన కార్యక్రమంలో స్థానిక చౌరస్తాకు ప్రభుత్వం ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ చౌక్ గా నామకరణం చేసింది. శిలా ఫలకం ఆవిష్కరణ కార్యక్రమంలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే, బాలీవుడ్ ప్రముఖ సింగర్స్ హరిహరన్, షాన్, గులామ్ ముస్తఫా ఖాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులని కూడా ఆహ్వానించారు. దీనితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు హాజరయ్యారు. ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ కు నివాళిగా ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు, బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు  మొక్కలు నాటారు.

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ప్రశంసించారు. మహారాష్ట్ర మంత్రి, సీఎం తనయుడు ఆదిత్య థాకరేకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పై రూపొందించిన పుస్తకాన్ని,  కండువాను ప్రతినిధులు అందించారు.

ఈ కార్యక్రమంలో ఉస్తాద్ గులామ్ ముస్తఫా ఖాన్ సోదరుడు ఉస్తాద్ ఆఫ్తాబ్ అలాం ఖాన్, కుమారులు ఖాదిర్ ముస్తఫా, రబ్బానీ ముస్తఫా, హసన్ ముస్తఫా, సయ్యద్ ముషారఫ్, జోసెఫ్ ఫెర్నాండెజ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

నాగబాబు 'మేము కాప్‌లం' సిరీస్ షూటింగ్ లో మతిపోగొట్టే మ్యాటర్.. జస్ట్ 17 రోజుల్లోనే ఫినిష్, ఎలా సాధ్యమైంది ?
Karuppu Movie: త్రిష, సూర్య మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయాల్సింది.. ఎలా మిస్సయ్యారో తెలుసా ?