Varma: కుట్రపూరితంగా నా చిత్రాన్ని అడ్డుకున్నారు... నట్టి కుమార్ తో వివాదంపై వర్మ సంచలన ప్రెస్ నోట్!

Published : Apr 20, 2022, 05:05 PM IST
Varma: కుట్రపూరితంగా నా చిత్రాన్ని అడ్డుకున్నారు... నట్టి కుమార్ తో వివాదంపై వర్మ సంచలన ప్రెస్ నోట్!

సారాంశం

డేంజరస్ మూవీ విడుదల విషయంలో నిర్మాత నట్టి కుమార్ తో ఏర్పడిన వివాదంపై దర్శకుడు వర్మ స్పందించారు. ప్రెస్ నోట్ విడుదల చేసిన వర్మ నట్టి కుమార్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు.   

గత కొద్ది రోజులుగా మీడియా లో చక్కర్లు కొడుతున్న నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణ ల విషయమై ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏప్రిల్ 8 ,2022 న మూడు బాషల్లో రిలీజ్ కి సిద్దంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని ఆపటానికి నట్టి క్రాంతి,నట్టి  కరుణ లు కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టు లో పిటీషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు
                            
ఆ క్రింది కోర్టు ఇచ్చిన injunction ఆర్డర్ ని ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది.నేను ఇప్పుడు నట్టి క్రాంతి నట్టి కరుణ ల మీద ఫోర్జరీ కి సంభందించిన కేసే కాకుండా, వివిధ మీడియా ఛానళ్లలో నా పై చేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి నట్టి క్రాంతి,నట్టి కరుణ ల ఫాదర్  అయినటువంటి నట్టి కుమార్  మీద  నేను , తుమ్మలపల్లి రామత్యనారాయణ గారు డిఫమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు forged డాక్యుమెంట్ ని ఉపయోగించి సినిమా ని ఆపి మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు కూడా నేను, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు వాళ్ల మీద damage కేసు వెయ్యబోతున్నాము                   

ఇప్పుడు విడుదల చేసేందుకు క్లియరెన్స్‌ ఆర్డర్ వచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని May 6 న విడుదల చెయ్య బోతున్నాము. దానికి సంభందించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ లు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము ఫోర్జరీ చేసి, దానిని నిజమైన డాక్యుమెంట్‌గా ఉపయోగించడం ద్వారా నట్టి క్రాంతి, నట్టి కరుణ లు  చేసిన  క్రిమినల్ చర్యలకి సంబంధించిన విషయాలు, అలాగే పైన పేర్కొన్న ఇంజక్షన్-ఆర్డర్‌ను నట్టిలు సేకరించిన విధానాన్ని ,  యంత్రాంగాన్ని  దుర్వినియోగ పరుచుకున్న తీరు నట్టి ఫ్యామిలీ యొక్క  నేరపూరిత స్వభావాన్ని తెలియజేస్తుంది

ఈ ప్రెస్ నోట్ తప్ప, ఇకపై  నేను ఈ విషయంపై ఇంకేం మాట్లాడబోను ..జస్ట్ వాళ్ల పైన చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతాను.. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయట పడబోతోంది

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌