‘వకీల్‌ సాబ్‌’ బెనిఫిట్ షోలు,ఉన్నట్లా,లేనట్లా ?

By Surya Prakash  |  First Published Apr 1, 2021, 1:32 PM IST

పవన్‌  కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్‌ రాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. 


వకీల్ సాబ్ ట్రైలర్ వచ్చిన దగ్గరనుంచీ పవన్ మేనియా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైపోయింది. ఈ సినిమా ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటేనే అర్ధం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆడియన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో. అందులోనూ పవన్ కళ్యాణ్‌ మూడు సంవత్సరాల తర్వాత వకీల్‌ సాబ్‌ సినిమా తో రాబోతున్నారు. ఏప్రియల్ 9 న సినిమా రిలీజ్ కాబోతోంది. రాజకీయాల్లోకి వెళ్లి పోయిన పవన్‌ మళ్లీ సినిమాలు చేయడని చాలా మంది అనుకున్నారు. కాని ఊహించని విధంగా పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. పవన్‌ అభిమానులు రీ ఎంట్రీని భారీ ఎత్తున సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా..ఎప్పుడు బెనిఫిట్ షోలకు వెళ్దామా అన్న ఉత్సాహంలో ప్యాన్స్ ఉన్నారు. ఈ నేపధ్యంలో వకీల్ సాబ్ చిత్రానికి బెనిఫిట్ షో కు ఫర్మిషన్స్ దొరుకుతాయా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ మేరకు దిల్ రాజు బెనిఫిట్ షోకు ఫర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో బెనిఫిట్ షోకు ఫర్మిషన్ ఇస్తారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బెనిఫిట్ షోకు ఇవ్వకపోయినా, రిలీజ్ రోజు అదే స్దాయిలో మార్నింగ్ షోకు జనం ఉంటారు. ఇక తెలంగాణా గవర్నమెంట్...రీసెంట్ గా ఎగస్ట్రా షోలు వేసుకోవటానికి, టిక్కెట్ రేటు పెంచుకోవటానికి ఫర్మిషన్స్ ఇచ్చింది. మల్టిఫ్లెక్స్ లలో ఇప్పటికే 200 రూపాయలు టిక్కెట్ రేటు చేసేసారు. అయితే బెనిఫిట్ షో అంటే ఖచ్చితంగా లోకల్ పోలీస్ ఫర్మిషన్ కావాల్సి ఉంటుంది. ఇవన్ని దృష్టి లో పెట్టుకుని చూస్తే బెనిఫిట్ షో పడుతుందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి అందరికీ.  
 
మరో ప్రక్క యూసుఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌ లో ఏప్రిల్ 3న  భారీ ఎత్తున జనాలతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్మాత దిల్ రాజు ప్లాన్‌ చేశాడు. పోలీసుల నుండి అనుమతి కోరాడు. పోలీసులు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అనుమతించలేం అంటూ తేల్చి చెప్పినట్లు సమాచారం. ప్రీ రిలీజ్‌ వేడుకలో పెద్ద ఎత్తున జనాలు హాజరు అవ్వబోతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోకు విరుద్దం అంటున్నారు. ఏప్రిల్‌ 30వ తారీకు వరకు తెలంగాణలో పబ్లిక్‌ గ్యాదరింగ్స్‌ ను నిషేదిస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. కనుక వకీల్‌ సాబ్‌ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కు తాము అనుమతించబోవడం లేదని పేర్కొన్నారు.  దీంతో  దిల్ రాజు ప్రీ రిలీజ్ వేడకకు...మరో ప్లేస్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4న హైటెక్స్ లో ఈవెంట్ ను నిర్వహించాలని భావిస్తున్నాడు. మరి దీనికైనా ఈవెంట్ కు పర్మిషన్ వస్తుందా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

 ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘పవన్‌ కల్యాణ్‌ను బిగ్‌ స్క్రీన్‌ పై చూసేందుకు మనం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. వెయిటింగ్‌ పూర్తయింది. ట్రైలర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మాత్రమే. ఏప్రిల్‌ 9న లంచ్, డిన్నర్‌ కలిసి చేద్దాం’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు వేణు శ్రీరామ్‌. హిందీ హిట్‌  ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘వకీల్‌ సాబ్‌’ రూపొందిన విషయం తెలిసిందే.

click me!