
మ్యాచో స్టార్ గోపీచంద్ చంద్ కొత్త సినిమాని ప్రారంభించారు. ప్రస్తుతం శ్రీవాస్‌తో `రామబాణం` సినిమా చేస్తున్న ఆయన తాజాగా కన్నడ దర్శకుడితో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దీన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఏ హర్ష దర్శకుడు. గోపీచంద్‌కిది 31వ సినిమా కావడం విశేషం.
సినిమాని ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించబోతున్నట్టు నిర్మాత కెకె రాధామోహన్ వెల్లడించారు. ఆయన చెబుతూ, మా ప్రొడక్షన్‌లో 14వ చిత్రంగా గోపీచంద్ సినిమాని తెరకెక్కిస్తున్నాం. గోపీచంద్, హర్ష కాంబినేషన్‌లో ఈ సినిమాని రూపొందించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభమవుతుంది` అని తెలిపారు నిర్మాత.
కన్నడలో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించారు దర్శకుడు ఏ హర్ష. ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నప్పటికీ రెగ్యూలర్‌కి పూర్తి భిన్నంగా ఉంటుందని, యాక్షన్‌తోపాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవింపుగా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. అంతేకాదు ఈ సినిమాతో ఆయన తెలుగులోకి అడుగుపెడుతున్నారు. ఇటీవల కన్నడ దర్శకులు సంచలనాలు క్రియేట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఇక్కడ `సలార్` తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం విశేషం.
ఈ సినిమాకి భారీ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.సినిమాటోగ్రాఫర్‌గా స్వామి జే, `కేజీఎఫ్` ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే నటీనటుల వివరాలు ప్రకటిస్తామని తెలిపారు. ఇక గోపీచంద్ ప్రస్తుతం `రామబాణం` చిత్రంలో నటిస్తున్నారు. శ్రీవాస్ దీనికి దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇందులో గోపీచంద్‌కి జోడీగా డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.సమ్మర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది.