
బాలీవుడ్ స్టార్లలో.. యూత్ లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో రణ్ బీర్ కపూర్ ముందు వరసలో ఉన్నారు. ఓ వైపు లవర్ బాయ్‌గా.. అమ్మాయిల మనసు దొచుకుంటూనే.. మరో వైపు యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలు కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు రణ్ బీర్ కపూర్. అప్పుడప్పుడు బాలీవుడ్ తో పాటు.. హిందీ సినిమాలను.. యాక్టింగ్ ఫీల్డ్ ను వెనకేసుకుని వస్తూ.. తమ కష్టాలు పగవానికి కూడా రావద్దు అన్నంతగా మాట్లాడుతుంటాడు. ఇక ప్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్ కు ముందుగా బ్రహ్మాస్త్ర సినిమాతో కాస్త ఊరటనిచ్చాడు రణ్ బీర్.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో యానిమల్ సినిమా చేస్తున్నాడు రణ్ బీర్ కపూర్. ప్రయోగాలకు పెద్ద పీట వేయడంతో రణ్ బీర్ ఎప్పుడూ ముందు ఉంటాడు. ఈక్రమంలోనే యానిమల్ సినిమాలో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు బాలీవుడ్ యంగ్ హీరో. . షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి లీకైన రణ్ బీర్ కపూర్ స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఇక నటన గురించి.. నటీనటుల గురించి... రకరకాలుగా ఆలోచించేవారికి.. ఫైనల్ గా ఓ సమాధానం చెప్పాడు రణ్ బీర్. నటన అనేది అందరికీ బయటి నుంచి కనిపించేంత సుఖంగా ఉండదు అన్నారు. లోపల చాలా కష్టాలుపడుతూ..మీకు నవ్వులను,సంతోషాన్ని పంచున్నాం అన్నారు. బీబీసీ చిట్‌చాట్ లో రణ్ బీర్ కపూర్ మాట్లాడుతూ.. యాక్టర్లకు బయట మంచి క్రేజ్, ఫేం ఉన్నప్పటికీ.. మంచి మంచి బట్టలు వేసుకుంటూ.. జాలీగా తిరుగుతంటారు అన్న అపోహలో ఉంటారు. మా కష్టాల గురించి ఎవరూ పట్టించుకోరు అన్నారు. సాధారణ ప్రజలు ఎమైనా తినాలీ అనుకుంటే వారికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. కాని మేం కడుపు మాడ్చుుకుని.. ఇష్టమైన ఫుడ్ త్యాగం చేసి.. బాడీలను మెయింటేన్ చేసుకోవాలి. లేకుండా మీరు ఇష్టపడే స్టార్లు.. ఇలా ఉండరు అన్నారు రన్ బీర్.
నటీనటులు.. ఎప్పుడూ సంతోషంగా ఏం ఉండరని, తరచూ బాధలో ఉంటారని అన్నాడు. నటీనటులు వృత్తిపరమైన డిమాండ్స్ వల్ల వాళ్లు తినాలనుకునే ఆహారం లాంటి ప్రాథమిక అవసరాలకు ఎప్పుడూ దూరమవుతుంటారని అన్నాడు. మంచి బాడీని..ఫిట్ నెస్ ను మెయింటైన్ చేయాలనే ఒత్తిడి అనారోగ్యకర ఆహారపు అలవాట్లకు దారితీస్తుంది. నటీనటులు పర్‌ఫెక్ట్ బాడీ లాంగ్వేజీలో కనిపించాలంటే.. కఠినమైన ఆహారపు నియమాలను పాటించాల్సి ఉంటుందన్నాడు రణ్ బీర్ కపూర్. యాక్టర్లు ఆకలితో అలమటిస్తున్నారు. ఎందుకంటే వాళ్లు తినాలనుకునే ఆహారాన్ని తినలేరు. నేనొక వేళ యాక్టర్‌ను కాకపోతే బరువు పెరిగినా పట్టించుకోకపోయే వాడిని. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. మీరు కూడా జీవితాన్ని కొంత ఆస్వాదించండి..అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక రణ్ బీర్ కపూర్ బాలీవుడ్ లో వరుస సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. యానిమల్ చేసుకుంటూనేు.. లవ్ రంజన్ దర్శకత్వంలో Tu Jhoothi Main Makkaar సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్.. రణ్ బీర్ కు జోడీగా నటించింది. ఇక ఈమూవీ ఈనెల 8న రిలీజ్ కాబోతోంది.