#VeeraSimhaReddy:ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని

Published : Jan 10, 2023, 07:42 AM IST
#VeeraSimhaReddy:ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని

సారాంశం

ఇటీవల వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో అభిమానుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్టు తెలిసింది. 

 సంక్రాంతికి వీర‌సింహారెడ్డి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు నంద‌మూరి హీరో బాల‌కృష్ణ‌. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని వీర‌సింహారెడ్డి సినిమాను రూపొందిస్తోన్న ఈ చిత్రానికి బజ్ ఓ రేంజిలో ఉంది. ముఖ్యంగా అఖండ ఘ‌న విజ‌యం త‌ర్వాత బాల‌కృష్ణ న‌టించిన చిత్రం కావటం ప్లస్ అవుతోంది.  వీర‌సింహారెడ్డి రిలీజ్ కోసం చాలా రోజులుగా నంద‌మూరి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు . రిలీజ్ డేట్ దగ్గర పడుతూండటంతో  మొన్న  ప్రీ రిలీజ్ పంక్షన్ చేసారు.  

తాజాగా ఈ  సినిమా నుంచి మాస్ మొగుడు అనే మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ లాంచ్ ఈవెంట్ లో డైరక్టర్ గోపిచంద్ మలినేని ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పారు. వివరాల్లోకి వెళితే...ఇటీవల వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో అభిమానుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో మాస్ మొగుడు సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని దీనిపై స్పందించాడు.
 
గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. సినిమా సెన్సార్ అయింది. వాళ్ళు కూడా సినిమా చాలా బాగా ఉంది అన్నారు. షూట్ షాట్ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి. మొన్న ఒంగోలులో జరిగిన ఈవెంట్ లో అక్కడ పోలీస్ లు 30వేలు పాసులు ఇచ్చారు, కానీ బయట ఇంకా 50వేల మంది అభిమానులు ఉన్నారని, వాళ్ళు చాలా బాధ పడ్డారని తెలిసింది. కొంతమంది అభిమానుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని తెలిసింది. ఇందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను అని అన్నాడు.

మరో ప్రక్క సినిమా ట్రైలర్ విడుదల చేసింది టీమ్. ఈ ట్రైలర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. మధ్య మధ్యలో వచ్చిన పొలిటికల్ సైటెర్స్ వైరల్ అవుతున్నాయి.  టెర్రిఫిక్ విజువల్స్ తో `సీమలో ఏ ఒక్కడూ కత్తిపట్టకూడదనే నేనొక్కన్ని కత్తి పట్టా` అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్..వీర సింహారెడ్డి`.. అంటూ బాలయ్య మీసం తిప్పుతున్న తీరు ఆయన నట విశ్వరూపం థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా వుంది. పుట్టింది పులిచర్ల..చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్.. అంటూ బాలయ్య సింహ గర్జన చేస్తున్న తీరు మాస్ కి పండగ వాతావరణాన్ని ముందే తెచ్చేస్తోంది. మరో ప్రక్క ..మైలు రాయికి మీసం మొలిచి నట్టుండాదిరా అంటూ అజయ్ ఘోష్ చెబుతున్న డైలాగ్ లు సినిమా ఏ రేంజ్ లో సంక్రాంతి రచ్చ చేయనుందో హింట్ ఇచ్చేస్తున్నాయి. ` 

ఇక పగోడు పంపుతున్న పసుపు కుంకుమలతో బతుకుతుంటే ముత్తైదువులా లేనూ..ముండమోపిలా వున్నా.. అంటూ వరలక్ష్మీ శరత్ కుమార్ చెబుతున్న డైలాగ్ లు సినిమా ఓ రేంజ్ రచ్చ చేయడం ఖాయం. బాలయ్య ఇంత వరకు చేసిన సీమ ఫ్యాక్షన్ సీన్ లకు `వీర సింహారెడ్డి` క్లైమాక్స్ లా వుంటుందని ట్రైలర్ తో స్పష్టమవుతోంది. బై బర్త్ నా డీఎన్ ఏకే పొగరెక్కువ అంటూ బాలయ్య అనడం సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్ లకు కొదవలేదని తెలుస్తోంది. రుషీ పంజాబీ అందించిన విజువల్స్ తమన్ సంగీతం బాలయ్య నట విశ్వరూపం  దుమ్ము రేపుతున్నాయి.

  బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌న్న‌డ హీరో దునియా విజ‌య్ విల‌న్‌గా వీర‌సింహారెడ్డితో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషిస్తోంది. త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.   బాలయ్యతో అదిరిపోయే మాస్ కంటెంట్ సినిమాలతో మూడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి బాలయ్యను హ్యాండిల్ చేసి హిట్ కొట్టాలంటే బోయపాటికి మాత్ర‌మే సాధ్యం అన్నట్టుగా పేరు తెచ్చుకున్నాడు. తన కెరిర్‌లో మొదటిసారిగా బాలయ్యతో సినిమా చేస్తున్న గోపీచంద్ మలినేని.. అసలు బాలయ్యను ఏ స్థాయిలో చూపించాడు.. ఏ రేంజ్ లో ఆయనతో యాక్షన్ చేయించాడు అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రాక్ ని మించి హిట్ అవుతుందని నమ్ముతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?