Latest Videos

గోపీచంద్ ‘విశ్వం’ హింది డబ్బింగ్ రైట్స్ కి మంచి రేటే వచ్చిందే , ఎంతంటే

By Surya PrakashFirst Published Jun 16, 2024, 2:15 PM IST
Highlights

ఓటీటీ, శాటిలైట్ రైట్స్  తగ్గిపోవ‌డం వ‌ల్ల ‘విశ్వం’ ఇబ్బందుల్లో ప‌డిన‌ట్టు వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ రైట్స్ మంచి మొత్తానికే వెళ్లాయనే వార్త అభిమానులకు కాస్త ఆనందం కలిగిస్తోంది.


హిట్ ,ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా వరస  పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు మ్యాచ్ స్టార్ గోపీచంద్. ఇన్ని ఫ్లాఫ్ ల తర్వాత కూడా ఆయన మార్కెట్ స్టడీగా ఉందంటే కారణం ఆయన చేసే యాక్షన్ కథలే. యాక్షన్ సినిమాలకు ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉంటారు. వాళ్లు ప్రతీసారి గోపిచంద్ హిట్ కొడతాడేమో అని చూస్తున్నారు. అలాగే నిర్మాతలు సైతం గోపిచంద్ తో సినిమా చేస్తే హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా పలుకుతాయని ఉత్సాహం చూపిస్తున్నారు.

కొన్ని సంవత్సరాలుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ.. సాలిడ్ హిట్ ను మాత్రం అందుకోలేక పోతున్నారు . రీసెంట్ గా  భీమా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు గోపీచంద్. భారీ అంచనాల మధ్య రిలీజైన ఆ చిత్రం నిరాశపరిచింది. దీంతో ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ విశ్వంపై అంచనాలన్నీ పెట్టుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.  ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ స్ట్రైక్ లో గోపీచంద్ లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలతో యమా స్టైలిష్ గా కనిపించారు. అలాగే  గోపీచంద్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. . 

 ఫస్ట్ స్ట్రైక్ లో గోపీచంద్ రోల్ ప్రామిసింగ్ గా ఉంది. డైలాగ్స్ చెప్పిన విధానం చూస్తే.. హీరో క్యారెక్టర్ కు గ్రే షేడ్‌ ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే  ఈ సినిమాలో గోపీచంద్ డ్యూయల్ రోల్ కూడా చేస్తున్నట్లు  చెప్పుకుంటున్నారు.  ఇక    `విశ్వం`  సినిమా ఇప్ప‌టికే ఓవర్ బడ్జెట్ అవ్వటంతో ...పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ  టేకొవ‌ర్ చేసింది. దర్శకుడు,  హీరో ఇద్దరు కూడా వరుస ఫ్లాఫ్స్ లో  ఉండటంతో లో బడ్జెట్ లో తెరకెక్కుతుంది అనుకున్నారు. కానీ టీసర్ రిలీజ్ తర్వాత సినిమా బడ్జెట్ గురించి  ఓ వార్త బయిటకు వచ్చింది.  ఆల్ మోస్ట్ 32-35 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ఈ సినిమా రూపొందుతుంది అని అంటున్నారు. అది ఓ రకంగా ఓవర్ బడ్జెట్టే. 

అయితే.. ఇప్ప‌టికే ఓవ‌ర్ బ‌డ్జెట్ అవ్వ‌డం, గోపీచంద్ సినిమాల మార్కెట్ డ్రాప్ అవ్వ‌డం, ఓటీటీ, శాటిలైట్ రైట్స్  తగ్గిపోవ‌డం వ‌ల్ల ‘విశ్వం’ ఇబ్బందుల్లో ప‌డిన‌ట్టు వినిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ రైట్స్ మంచి మొత్తానికే వెళ్లాయనే వార్త అభిమానులకు కాస్త ఆనందం కలిగిస్తోంది. 13కోట్ల రూపాయలకు ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ వెళ్లినట్లు సమాచారం. ఇది మంచి మొత్తం. యాక్షన్ సినిమా కావటం, గోపిచంద్ యాక్షన్ సినిమాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్ లో విలవ ఉండటంతో ఈ రేటు పలికిందని చెప్తున్నారు.

 విశ్వం మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, చిత్రాలయం స్టూడియోస్‌‌ పై వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీను వైట్ల పలు బ్లాక్‌ బస్టర్స్‌ తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. మరి ఈ మూవీతో గోపీచంద్ ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.

click me!