గోపీచంద్ చాణక్య.. రిలీజ్ డేట్ ఫిక్స్?

Published : Aug 26, 2019, 11:40 AM IST
గోపీచంద్ చాణక్య.. రిలీజ్ డేట్ ఫిక్స్?

సారాంశం

యాక్షన్ హీరోగా మాస్ ఆడియెన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో గోపీచంద్ గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. సౌఖ్యం - గౌతమ్ నందా - ఆక్సిజన్ - పంతం వంటి సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి.   

అయితే ఇప్పుడు ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని చాణక్య సినిమాతో రెడీ అవుతున్నాడు. గోపీ ఈ సినిమాలో 'రా' ఏజెంట్ గా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు దాదాపు ఎండింగ్ కు వచ్చేశాయి. సినిమా డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే ఒక పాట చిత్రీకరణ కోసం గోపి గ్యాంగ్ ఇటలీ వెళ్లినట్లు సమాచారం. 

ఆ సాంగ్ షూట్ అయిపోగానే వీలైనంత త్వరగా రెగ్యులర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్రణాళికలు రచిస్తోంది. ఇక సినిమాను అక్టోబర్ 4న రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. కోలీవుడ్ డైరెక్టర్ తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ - జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో