రిలీజ్ కి ముందే గోపీచంద్ సినిమాకు లాభాలు.. సైరాతో యుద్ధమే?

Published : Oct 02, 2019, 10:19 AM ISTUpdated : Oct 02, 2019, 10:21 AM IST
రిలీజ్ కి ముందే గోపీచంద్ సినిమాకు లాభాలు.. సైరాతో యుద్ధమే?

సారాంశం

వరుస అపజయాలతో సతమతమవుతున్న మ్యచో మ్యాన్ గోపీచంద్ మరో యాక్షన్ మూవీతో సిద్దమయ్యాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చాణక్య సినిమా టీజర్ ట్రైలర్ ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది

వరుస అపజయాలతో సతమతమవుతున్న మ్యచో మ్యాన్ గోపీచంద్ మరో యాక్షన్ మూవీతో సిద్దమయ్యాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. చాణక్య సినిమా టీజర్ ట్రైలర్ ఓ వర్గం ఆడియెన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది. ఇకపోతే సినిమాకు సంబందించిన ప్రమోషన్ డోస్ కూడా గట్టిగానే పెరుగుతోంది. 

ఇక సినిమా రిలీజ్ కు ముందే నాన్ థ్రియేటికల్ రైట్స్ తో మంచి లాభాలను అందించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా 15కోట్ల వరకు లాభాల్ని అందించినట్లు సమాచారం. హిందీ డబ్బింగ్ రైట్స్ 9కోట్లకు అమ్ముడవగా తెలుగు శాటిలైట్ రైట్స్ ను 4కోట్లకు స్టార్ మా తీసుకుంది. ఇక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో అమెజాన్ ప్రైమ్ 2కోట్లతో డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. 

రిలీజ్ కు ముందే దాదాపు నిర్మాతకు మంచి లాభాలే అందాయి. ఇక సినిమాకు ఉన్న హైప్ కి జరిగిన బిజినెస్ కూడా జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది. అయితే సైరాకు ఈ సినిమా ఎంతవరకు పోటీని ఇస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే సైరకు వచ్చిన పాజిటివ్ టాక్ సినిమా కలెక్షన్స్ ని పెంచుతోంది. సైరాను ఎదుర్కోవాలంటే చాణక్య మినిమమ్ సాలిడ్ టాక్ ను అందుకోవాలి. మరి గోపీచంద్ యాక్షన్ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్