
భీమా సినిమా గోపిచంద్ కు కమ్ బ్యాక్ హిట్ మూవీ అంటున్నారు అభిమానులు. చాలా రోజుల తర్వాత గోపిచంద్ కు హిట్ పడిందని, భీమా సినిమాలో గోపీచంద్ అదరగొట్టాడని, నటన పరంగా దాదాపుగా క్యారక్టర్ లో జీవించాడని ప్రశంసలు కురిపిస్తున్నారు .అలాగే సినిమా కథ అటూ ఇటూగా ఉన్నా ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటూ రివ్యూస్ వచ్చాయి. ఈ నేపధ్యంలో వీకెండ్ తర్వాత సోమవారం కూడా కొన్ని చోట్ల ఓకే అనిపించుకునే కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం నాలుగు రోజుల్లో ఎంత వచ్చింది..ఎంత వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందోచూద్దాం.
మొదటి రోజు - 02.08cr
రెండో రోజు - 01.12cr
మూడో రోజు - 00.96cr
నాలుగో రోజు - 00.57cr
నాలుగు రోజులకి..
తెలంగాణా - 01.92cr
( Brake Even - 03.50cr)
రాయలసీమ - 00.81cr
( Brake Even - 01.50cr )
కోస్తాధ్ర +ఉత్తరాంధ్ర- 02.00cr
( Brake Even - 04.50cr )
రెండు తెలుగు రాష్ట్రాలు 4Days
Total Theatrical Gross - 08.14cr
రెండు తెలుగు రాష్ట్రాలు 4Days
Total Theatrical Share - 04.73cr
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా + ఓవర్ సీస్ - 00.50cr
( Brake Even - 01.80cr )
Worldwide 4Days
Total Theatrical Gross - 09.40cr
వరల్డ్ వైడ్ 4Days
Total Theatrical Share - 05.23cr
Worldwide Theatrical Share Break Even - 12.00cr
ట్రేడ్ నుంచి అందుతున్న ఈ లెక్కల ప్రకారం ‘భీమా’ (Bhimaa) చిత్రానికి రూ.10.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.12 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇప్పుడున్న టాక్ తో అయితే కొద్దిగా కష్టమే. ఏమన్నా ఈ రెండు రోజుల్లో పికప్ అయ్యి పాజిటివ్ టాక్ వస్తే తప్ప టార్గెట్ అందుకోవడం కష్టం.
ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్.. కాకపోతే కొంచెం సోసియో ఫాంటసీ టచ్ ఉన్న సినిమా. గోపీచంద్ సరసన (Malvika Sharma) మాళవిక శర్మ, (Priya Bhavani Shankar) ప్రియా భవానీ శంకర్.. లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘శ్రీ సత్యసాయి ఆర్ట్స్’ బ్యానర్‌పై కెకె రాధామోహన్ (K. K. Radhamohan) ఈ చిత్రాన్ని నిర్మించారు.