
ఇది సోషల్ మీడియా యుగం. దీని పుణ్యాన సామాన్యులు క్షణాల్లో సెలబ్రిటీలు అయిపోవచ్చు. బిచ్చగాళ్ల నుండి పిచ్చోళ్ల వరకు ఎందరో సెలెబ్స్ అయ్యారు. ఓవర్ నైట్ దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు. వాళ్లలో బుల్లితెర, వెండితెర స్టార్స్ వెలుగొందుతున్న వాళ్ళు కూడా కొందరున్నారు. కొందరు మాత్రం కనుమరుగయ్యారు. పాకిస్తాన్ లో నాగార్జున పోలికలతో ఉన్న ఓ వ్యక్తి పిచ్చ పాప్యులర్ అయ్యాడు. అతడి పేరు జైన్ అక్మల్ ఖాన్. ఇతగాడు నాగార్జున వలె ఉంటాడు. ఆయన హెయిర్ స్టైల్, ఫేస్ కట్ నాగార్జునకు దగ్గరగా ఉంటుంది.
జైన్ అక్మల్ ఖాన్ చాలా కాలంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. షికారి మాస్ పేరుతో ఫుడ్ వ్లాగ్స్ చేస్తాడు. అతడి వీడియోలు చేసిన కొందరు మీరు ఇండియన్ హీరో నాగార్జున అక్కినేని వలె ఉన్నారని కామెంట్స్ చేసేవారట. దాంతో జైన్ అక్మల్ ఖాన్ హీరో నాగార్జున గురించి తెలుగుకున్నాడు. నాగార్జునను బాడీ లాంగ్వేజ్, టాకింగ్ స్టైల్ ఇమిటేట్ చేస్తూ వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. అనూహ్య స్పందన వచ్చింది. గతంలో కంటే అతడి వీడియోలకు వ్యూస్ పెరిగాయి. ఆ విధంగా జైన్ అక్మల్ ఖాన్ బాగా పాప్యులర్ అయ్యాడు.
ప్రస్తుతం జైన్ అక్మల్ ఖాన్ నెలకు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రెండు మూడు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడట. జైన్ అక్మల్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగార్జున ఫీచర్స్ తో పుట్టిన జైన్ అక్మల్ ఖాన్ హ్యాపీగా వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.