ఈసారైనా హిట్టు కొడతారా?

Published : Jan 11, 2019, 03:23 PM ISTUpdated : Jan 11, 2019, 03:32 PM IST
ఈసారైనా హిట్టు కొడతారా?

సారాంశం

యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ ఇప్పుడు సక్సెస్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎన్ని సినిమాలు చేసిన వర్కౌట్ అవ్వడం లేదు. దర్శకులను మార్చినా కంటెంట్ మార్చినా కూడా గోపి సినిమాకు పెద్దజీగా కలెక్షన్స్ రావడం లేదు. 

యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ ఇప్పుడు సక్సెస్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎన్ని సినిమాలు చేసిన వర్కౌట్ అవ్వడం లేదు. దర్శకులను మార్చినా కంటెంట్ మార్చినా కూడా గోపి సినిమాకు పెద్దజీగా కలెక్షన్స్ రావడం లేదు. ఎంతో నమ్మకంగా సంపత్ నంది దర్శకత్వంలో నటించిన గౌతమ్ నంద కూడా ఈ హీరోకు ఏ మాత్రం లాభం ఇవ్వలేకపోయింది. 

అయితే మరోసారి అదే దర్శకుడితో సినిమా చేయడానికి గోపి సిద్దమవుతున్నాడు. అలాగే సంపత్ నందికి కూడా హిట్టు అవసరం. ఎందుకంటే చాలా ఉంది. స్టార్ హీరోలతో సినిమా చేద్దామని అనుకున్నప్పటికీ ఫెయిల్యూర్స్ లో ఉండడంతో ఎవరు కూడా స్క్రిప్ట్ వినడానికి కూడాఇష్టపడటం లేదు. ఇక ఫైనల్ గా గోపిని ఒప్పించి మంచి యాక్షన్ ఎంటర్టైనర్ ను సెట్స్ పైకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. 

ప్రస్తుతం గోపీచంద్ తిరు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తవ్వగానే సంపత్ నంది ప్రాజెక్ట్ ను వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ గోపి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ కాంబో ఈసారైనా క్లిక్ అవుతుందో లేదో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Double Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 9 డబుల్‌ ఎలిమినేషన్‌, 14వ వారం ఈ ఇద్దరు ఔట్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే
Nagababu: సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ చేసిన స్టార్ హీరో.. నాగబాబు, భరణి ఇద్దరి సమస్య ఒక్కటే.. అందుకే ఈ బంధం