Goodachari2 First Look: ఇంటర్నేషనల్‌ స్పైగా అడవిశేష్‌.. అదిరిపోయిన ప్రీ విజన్

Published : Jan 09, 2023, 06:07 PM ISTUpdated : Jan 09, 2023, 06:09 PM IST
Goodachari2 First Look: ఇంటర్నేషనల్‌ స్పైగా అడవిశేష్‌.. అదిరిపోయిన ప్రీ విజన్

సారాంశం

అడవిశేష్‌ నటిస్తున్న మరో పాన్‌ ఇండియా మూవీ `గూఢచారి 2`. ఈ సినిమా ఫస్ట్ లుక్‌, ప్రీ విజన్ వీడియోలు విడుదలయ్యాయి. ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి.   

కాప్‌ రోల్స్ కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు అడవిశేష్‌. ఆయన వరుసగా `క్షణం`, `ఎవరు`, `గూఢచారి`(స్పై) `మేజర్‌`, `హిట్‌2` చిత్రాలతో అలరించారు. ఇప్పుడు మరోసారి స్పైగా రచ్చ చేయబోతున్నాడు. ఆయన సూపర్ హిట్‌ ఫిల్మ్ `గూఢచారి 2`లో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని సోమవారం విడుదల చేశారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో `గూఢచారి 2` ఫస్ట్‌ లుక్‌ని రివీల్‌ చేశారు. 

ఈ సందర్భంగా ప్రీ విజన్‌ పేరుతో ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో యాక్షన్‌ మూడ్‌లో ఉన్న అడవిశేష్‌ అదరగొట్టారు. ఫార్మల్‌ వేర్‌లో స్లీక్‌గా, స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు. బిల్డింగ్‌ నుంచి పడిపోతూ ఒకరిని కాల్చడం విశేషం. ఈ సీన్లు అదిరిపోయేలా ఉన్నాయి. అంతేకాదు శేష్‌ ఇండియా నుంచి ఆల్ప్స్  పర్వతాల వరకు గూఢచారిగా అతని విజువల్స్ ని చూపించారు. ఈ ప్రీ విజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 

`గూఢచారి`లో అడవిశేష్‌ ఇండియన్‌ స్పైగా కనిపిస్తుండగా, ఇప్పుడు సీక్వెల్‌లో అంతర్జాతీయ స్పైగా కనిపించబోతున్నాడని చిత్ర బృందం తెలిపింది. ఈ ఏడాది ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి `మేజర్‌` ఎడిటర్‌ వినయ్ కుమార్‌ సిరిగినీడి దర్శకుడిగా మారుతున్నారు. ఈ స్టోరీని అడవిశేష్‌ అందించడం విశేషం. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైనర్మెంట్స్ పతాకాలపై టిజి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు
2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?