Sai Dharam Tej Video : ఆ వ్యక్తే నన్ను బతికించాడు.. ఆ మూడు కుటుంబాలకు రుణపడి ఉంటా : సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్

Published : Mar 26, 2022, 07:36 PM ISTUpdated : Mar 26, 2022, 08:06 PM IST
Sai Dharam Tej Video : ఆ వ్యక్తే నన్ను బతికించాడు.. ఆ మూడు కుటుంబాలకు రుణపడి ఉంటా  : సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్

సారాంశం

మోగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) గతేడాది బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఇందుకు తన  క్షేమం కోరిన ప్రతి ఒక్కరికి తాజాగా ధన్యవాదాలు  తెలుపుతూ వీడియోను షేర్ చేశారు.

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej గతేడాది సెప్టెంబర్ నెలలో బైక్ ప్రమాదానికి గురై కొన్ని నెలలు ఇంటికే పరిమితం అయ్యాడు. ఆసుపత్రిలో సుదీర్ఘ కాలం చికిత్స తీసుకున్నాడు.  ప్రమాదం జరిగిన మూడు వారాల తర్వాత కూడా ఆయన స్పృహలోకి రాకపోవడం అప్పట్లో ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేసింది. ఒక నెల ఆసుపత్రి బెడ్ కి పరిమితమైన సాయి ధరమ్.. మరో నెల రోజుల పాటు ఇంటిలో రెస్టు తీసుకున్నారు. కోలుకున్న తర్వాత కూడా సాయి ధరమ్ తేజ్ మీడియా ముందుకు రాలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తున్నాడు. 

అయితే, తను ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్ ఎంత ఖంగారు పడ్డారో తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ మళ్లీ మామూలు స్థితికి రావాలని,  త్వరగా కోలువాలని అందరూ ఆ దేవుడిని ప్రార్థించిన విషయం తెలిసిందే. అయితే, ఐదునెలల తర్వాత సాయి ధరమ్ సోషల్ మీడియా వేదిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోనూ షేర్ చేశాడు. 

ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. గత ఆరునెలల గురించి నేను చాలా నేర్చుకున్నాను. గ్రాటీట్యూట్, థ్యాంకింగ్, హెల్త్, ఫ్యామిలీపై మరింత గౌరవం పెరిగింది. ముందుగా నన్ను బతికించిన సయ్యద్ అబ్దుల్ ఫహాద్ కు చాలా క్రుతజ్ఞతలు, నీకున్న మానవత్వంతోననే నేను బతికి ఉన్నాను. అలాగే అపోలో ఆస్పత్రిలో నాకు మెరుగైన వైద్యం అందించిన హెల్త్ టీంకు స్పెషల్ థ్యాంక్స్ తెలుపుతున్నారు. ఆ తర్వాత నా మొదటి ఫ్యామిలీ అయిన చిరంజీవి Chiranjeevi, పవన్ కళ్యాణ్ Pawan Kalyan, నాగబాబు, చరణ్ Ram Charan, అల్లు అర్జున్ Allu Arjun, మెగా ఫ్యామిలీ నా ప్రత్యేక ధన్యవాదాలు.  ఆ తర్వాత నేను రెండో కుటుంబంగా భావించే సినీ పరిశ్రమలోని తోటి యాక్టర్స్, సినీ పెద్దలు, ప్రముఖులు నా ఆరోగ్యం పట్ల ఆరా తీయడం సంతోషకరంగా ఉంది. ఇక నా మూడో ఫ్యామిలీ అయిన నా అభిమానులు, మెగా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ముఖ్యంగా నా  స్టాఫ్ నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. వారికీ థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే నా క్షేమం కోరి దేవుడికి ప్రేయర్స్ చేసిన  వారికి, నా మూడు కుటుంబాలకు రుణపడి ఉంటానని చెప్పాడు. ఈ సందర్భంగా వాహనదారులకు సాయి ధరమ్ తేజ్ ఒక సూచన చేశారు. దయచేసి అందరూ హెల్మెట్ మాత్రం తప్పకుండా ధరించండి అన్నారు. తాను హెల్మెట్ మూలంగానే బతికి ఉన్నట్టు తెలిపాడు.అలాగే తన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు మెగా అభిమానులకు తెలియజేసిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక క్రుతజ్ఞతలు తెలిపారు. 

 

సాయి ధరమ్ తేజ్ చివరిగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్’ (Republic). ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు కొద్ది రోజుల ముందు సాయి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఈవెంట్ కు హాజరు కాలేకపోయాడు. అయితే ఆయన లేకపోయినా సినిమాను సక్సెస్ చేసినందుకు చిత్ర యూనిట్ కు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధ్యనవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తేజ్ తన నెక్ట్స్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ అందించారు.  ఈ నెల  28న సుకుమార్, బాబీ నిర్మించనున్న చిత్రంలో తేజ్ హీరోగా నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్ర  షూటింగ్ మొదలు కానున్నట్టు  తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ