
దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్ర 'విరాటపర్వం'. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవలె చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించిన చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. మూడేండ్ల కిందనే ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించినా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. ఎట్టకేళలకు ఈ చిత్రాన్ని ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈరోజు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని శిల్పా రామంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అతిథిగా విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హాజరయ్యారు.
ఈవెంట్ లో ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేశ్ మాట్లాడుతూ
అభిమానులందరికీ నమస్కారం.. ఈ ఫంక్షన్ కు నేను రావడానికి ముఖ్యమైన కారణం నాకు సినిమాపై ఉన్న మక్కువే. ‘మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే’ అనే డైలాగ్స్ చాలా బాగా ఉన్నాయి. రానా ఏ సినిమా చేసిన సబ్జెక్ట్ ను చాలా శ్రద్ధగా ఎంచుకుంటాడు. ఇందుకు అభినందిస్తున్నాడు. ఇక విరాట పర్వం సినిమా ట్రైలర్ చూసినప్పుడే పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. ఒక్కో సీన్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నారు. ఇక రానా గురించి మాట్లాడుతూ.. రానా నువ్వు ఎప్పటికీ ఉన్న సక్సెస్ అవుతావ్.. ఆల్రెడీ నువ్వు సక్సెస్ రూట్ లోనే ఉన్నాడు. త్వరగా కాకపోయినా.. కచ్చితంగా భవిష్యత్ నీదే. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన నిజాయితీ గలఫిల్మ్ మేకర్్ వేణు ఉడుగుల.. ఆయన డెడికేషన్ నాకు బాగా నచ్చింది. విరాట పర్వం రైటింగ్, విజువల్స్, ప్రొడక్షన్, సాయి పల్లవి, ప్రియమణి, జరీనా, ఈశ్వరీ, రానా, నవీన్ చంద్ర అవుట్ స్టాండింగ్ పర్పార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.
ఇక నాకు నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి. ముఖ్యంగా ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా తర్వాత సాయి పల్లకి కచ్చితంగా జాతీయ స్థాయలో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అలాగే సినిమా కోసం పనిచేసిన ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ కు మరోసారి ఆల్ ద బెస్ట్ చెబుతున్నారు. జూన్ 17న థియేటర్లలో విరాటపర్వం సందడి నెలకొంటుందని తెలిపారు. సినిమాకు తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. జూన్ 17న రిలీజ్ కానున్న మూవీని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేదా పేతురాజ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.