‘విరాటపర్వం’లొ మేం చెప్పాలనుకుంది ఇదే.. మాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు వీళ్లే.. వేణు ఉడుగుల స్పీచ్..

Published : Jun 15, 2022, 09:58 PM IST
‘విరాటపర్వం’లొ మేం చెప్పాలనుకుంది ఇదే.. మాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు వీళ్లే.. వేణు ఉడుగుల స్పీచ్..

సారాంశం

దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్ర 'విరాటపర్వం'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  ఈరోజు గ్రాండ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా  దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ సినిమా  గురించి పలు విషయాలను తెలిపాడు.    

దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్షన్ లో రానా దగ్గుబాటి, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్ర 'విరాటపర్వం'. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇటీవలె చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించిన చిత్ర  యూనిట్ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.  మూడేండ్ల కిందనే ఈ చిత్రం షూటింగ్ ను ప్రారంభించినా పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే వచ్చింది. ఎట్టకేళలకు ఈ చిత్రాన్ని ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈరోజు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలోని శిల్పా రామంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. అతిథిగా విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హాజరయ్యారు.   

ఈవెంట్ లో దర్శకుడు వేణు ఉడుగుల మాట్లాడుతూ..  ఈవెంట్ కు వచ్చిన అథితులు వెంకటేశ్ గారికి, ఇతరులకు ధన్యవాదాలు. అలాగే నా  రైటింగ్ అండ్ డైరెక్షన్ టీం కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సింహాలు వాటి చరిత్రను అవే చెప్పుకోవాలి.. లేదంటే వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది. గూడవల్లి రామబ్రహ్మం, రాఘవేంద్ర ఫాదర్ ప్రకాశ్ రాజ్, టీ క్రిష్ణ, సుకుమార్ స్ఫూర్తితోనే మూలాల్లోకి నేను వెళ్లి తీసిన సినిమా ‘విరాట పర్వం’. మేం సినిమాలో ఎక్కడా వయలెన్స్ ను గ్లామరైజ్ చేయలేదు. మావో సిద్ధాంతాన్ని అసలే ప్రాపగాండగా చెప్పలేదు. 1990 వ దశకంలో జరిగిన ఓ ప్రేమ కథను మాత్రమే చూపించాం. మనిషిని  గా చూపించలేదు. ప్రేమ ఒక ధైవం అని చెప్పాం.. ప్రేమను మించిన దైవం ఏదీ లేదని చెప్పాం. దానికున్న శక్తిని గురించి చెప్పాం. ఈ చిత్రంలో ప్రధానంగా సాయి పల్లవి చాలా ముఖ్యంగా. ఆమె పాత్రకు తోడుగా రానా కూడా సమ ప్రధానం అని తెలియజేశారు. అలాగే ఈ సినిమాలోని ఎనిమిది కీలకమైన పాత్రల్లో ఐదుగురు  స్త్రీలే ఆ పాత్రలను పోషించారన్నారు. Virata Parvam చిత్రం  అనేది కచ్చితంగా ప్రేక్షకుల జీవితంలో గొప్ప అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. 

ఇక ఇప్పటికే ఈ చిత్రం  నుంచి  రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను  ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇటీవల మూడు సాంగ్స్ ‘కోలు కోలు’, ‘వీర తెలంగాణ’, ‘నగాదారిలో’ రిలీజ్ అయి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇటీవల మరో సాలిడ్ సాంగ్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి క్యాచీ ట్యూన్ అందించారు. అన్ని అడ్డంకులను, సమస్యలను అధిగమించి ఎట్టకేళలకు ‘విరాట పర్వం’ జూన్ 17న రిలీజ్ చేయనున్నారు. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రాము, నివేదా పేతురాజ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం
Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌