
డైనమిక్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారు. గతంతో పోల్చితే భిన్న కథలను ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 'జిన్నా' (Ginna)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈక్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిద్దుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ జానర్ లో వస్తున్న ఈ మూవీకోసం విష్ణు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ ఓ రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘గోలీసోడావే’ (Golisoda) టైటిల్ లో ఈ రోజు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. పెప్పీ డ్యాన్స్ నంబర్ 'గోలీ సోడా వే' పాట అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ పాటలో మంచు విష్ణు, గ్లామ్ డాల్ పాయల్ రాజ్‌పుత్ అదిరిపోయే స్టెప్పులేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ స్వరపరిచిన సంగీత సారథ్యంలో నకాష్ అజీజ్, నూతన మోహన్ లు పాటను అద్భుతంగా పాడారు. ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను సాధిస్తోంది. షూటింగ్ సమయంలో కాలుకు గాయమైనప్పటికీ, అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ తో విష్ణు అదరగొట్టడంతో ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ చిత్రానికి ఈశాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ భారీ తారాగణం, బడా సాంకేతిక నిపుణులతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్ (Payal Rajput), సన్నీ లియోన్ (Sunny leone)ల అందం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానుంది. జి. నాగేశ్వర్ రెడ్డి కథ అందించారు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీగా అందిస్తున్నారు. కోన వెంకట్ స్క్రిప్టు అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.