ఇండియా వచ్చిన సోనాలి.. హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చిన భర్త!

Published : Dec 03, 2018, 12:07 PM IST
ఇండియా వచ్చిన సోనాలి.. హెల్త్ గురించి క్లారిటీ ఇచ్చిన భర్త!

సారాంశం

ఈ ఏడాది జూన్ లో ప్రముఖ నటి సోనాలి బింద్రే తనకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిపి అందరి మనసులను కదిలించిన సంగతి తెలిసిందే. ఇక ఆరు నెలల తరువాత ఆమె తిరిగి సొంత గూటికి చేరుకుంది.

ఈ ఏడాది జూన్ లో ప్రముఖ నటి సోనాలి బింద్రే తనకు క్యాన్సర్ ఉన్నట్లు తెలిపి అందరి మనసులను కదిలించిన సంగతి తెలిసిందే. ఇక ఆరు నెలల తరువాత ఆమె తిరిగి సొంత గూటికి చేరుకుంది. అమెరికాలో క్యాన్సర్ వ్యాధికి సంబందించిన చిక్కిత్స కోసం పూర్తిగా మారిపోయిన సోనాలి ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టగానే మళ్ళీ నవ్వుతూ దర్శనమిచ్చింది.  

భర్త గోల్డి బెహల్ సోనాలి ఆరోగ్యం గురించి మీడియాకు తెలియజేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని మళ్ళీ వైద్యం కోసం న్యూ యార్క్ కి వెళ్లాల్సిన అవసరం లేదని అలాంటి పరిస్థితిలో రాకూడదని తాను అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చాడు. అంతే కాకుండా అంకె తన భాగస్వామి అయినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు చెబుతూ.. క్యాన్సర్ ఉన్నా కూడా మనోధైర్యంతో ముందుకు సాగిందని మళ్ళి కోలుకొని కుటుంబంలో సంతోషాన్ని నింపిందని అన్నారు. 

ఇక కొన్ని రోజుల వరకు డైలీ చెకప్స్ ఉంటాయని అది కూడా కొన్ని రోజులేనని సోనాలి త్వరలోనే మరింత శక్తివంతంగా కనిపిస్తుందని అన్నారు. తన సతీమణి ఆరోగ్యం కోసం శ్రేయోభిలాషులు అభిమానులు మంచి మనసుతో బాగుండాలని కోరుకున్నారు. వారందరికి కృతజ్ఞతలని గోల్డి బెహల్ వివరణ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు