దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. మలయాళీ చిత్రం ‘లూసీఫర్’కు ఇది తెలుగు రీమేక్. ఈ మూవీలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలలో నటించారు.
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో రీసెంట్ గా వచ్చిన చిత్రం 'గాడ్ ఫాదర్' (Godfather). దసరా కానుకగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా మొదలైనా ఆ తర్వాత ఊహించని విధంగా డ్రాప్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు చాలా మంది ఎదురుచూస్తున్నారు. అయితే చడీ చప్పుడూ లేకుండా ఈ సినిమా ఓటిటిలో ప్రత్యక్ష్యమైంది. 'గాడ్ ఫాదర్’ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
నిన్న రాత్రి నుంచి (నవంబరు 19) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత ఆర్.బీ చౌదరి నిర్మించారు. ఇప్పటికే దసరా రోజు రిలీజైన నాగార్జున ది ఘోస్ట్, రీసెంట్ గా కార్తీ నటించిన సర్దార్ సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మాత ఆర్.బీ చౌదరి నిర్మించగా.. తమన్ బాణీలు స్వరపరిచాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
undefined
మలయాళీ మూవీ ‘'లూసీఫర్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ కీలక పాత్రలలో నటించారు. సునీల్, షఫీ, అనసూయ, పూరి జగన్నాధ్ తదితరులు ఇతర పాత్రల్లో నటింటారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. థమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఒరిజనల్ వెర్షన్ లూసిఫర్ అమెజాన్ ప్రైమ్‌లో మలయాళంతో పాటు తెలుగు వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది.
మెగాస్టార్ ప్రస్తుతం మెగా కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీ ఎంట్రీని గ్రాండ్‌గా ప్లాన్ చేసుకున్న చిరు.. అదే జోష్‌ను తర్వాతి సినిమాల్లో చూపించలేకపోతున్నాడు. ‘ఖైదీ నెంబర్ 150’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత, ‘సైరా’, ‘ఆచార్య’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో చిరు తీవ్రంగా నిరాశపడ్డాడు. వాటితో పోలిస్తే ‘గాడ్‌ఫాదర్’ కూడా మెగాస్టార్‌కు కాస్త రిలీఫ్ ఇచ్చింది.