వర్మపై కేసు.. అరెస్టుకు రంగం సిద్ధం?

First Published Feb 2, 2018, 11:55 AM IST
Highlights
  • గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ మూవీతో వర్మ సంచలనం
  • ఈ మూవీపై మహిళా సంఘాల అభ్యంతరం
  • వర్మ పై సైబర్ క్రైమ్ కేసు, అవసరమైతే అరెస్ట్

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ఎంతటి వివాదం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా విషయంలో వర్మపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేశారు. ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’అంటూ శృంగారం పేరుతో అశ్లీల చిత్రాన్ని నిర్మించారంటూ ఆర్జీవీపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్టు సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు.

 

ఈ కేసులో భాగంగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకు నోటీసులు పంపనున్నట్టు తెలిపారు. నోటీసులకు స్పందించకుంటే అవసరమైతే అరెస్ట్ చేస్తామని అన్నారు. మరోవైపు ‘జీఎస్టీ’ని ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించిన విమియా సంస్థ హైదరాబాద్ పోలీసుల ఆదేశాల మేరకు ఆ సౌకర్యాన్ని రద్దు చేసింది. కేవలం డబ్బులు చెల్లించి చూసే అవకాశాన్ని కల్పించగా, ఇప్పుడు అది కూడా రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఇంటర్నెట్  ద్వారా దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని మూడు డాలర్లకు డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని రద్దు చేస్తున్నామంటూ విమియో సంస్థ తమకు అధికారికంగా రాసిన లేఖ అందిందని డీసీపీ రఘవీర్ తెలిపారు.

 

జీఎస్టీ చిత్రంపై మహిళ సంఘాలు నేతలు, సామాజిక కార్యకర్తలు ఆందోళనలు చేపట్టినా వర్మ మాత్రం వెనక్కుతగ్గలేదు. అంతేకాదు సామాజిక కార్యకర్త దేవిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీఎస్టీ సినిమా కథ తనదేనంటూ రచయిత జయకుమార్ సైతం ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత రాజుకుంది.

click me!