#chiranjeevi: `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌ టైమ్‌ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌.. సినిమాపై హైప్‌ పెంచుతుందా?

Published : Sep 27, 2022, 10:01 PM IST
#chiranjeevi: `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌ టైమ్‌ ఫిక్స్.. మెగా ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌.. సినిమాపై హైప్‌ పెంచుతుందా?

సారాంశం

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ `గాడ్‌ ఫాదర్‌` ప్రమోషన్‌ జోరు పెంచారు. రేపు బుధవారం అనంతపూరంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు.  తాజాగా ట్రైలర్‌ టైమ్‌ ఫిక్స్ చేశారు.  

చిరంజీవి తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ న్యూస్‌ చెప్పారు. `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు. గ్యాప్‌ లేకుండా సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. రేపు జరగబోయే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ `గాడ్‌ ఫాదర్‌` ప్రమోషన్‌ జోరు పెంచారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలను విడుదల చేశారు. రేపు బుధవారం అనంతపూరంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. 

ఈ ఈవెంట్‌లో సాయంత్రం ఎనిమిది గంటలకు `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. మరోవైపు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌ గెస్ట్ గా వస్తారనే ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఈ వార్త కోసం అభిమానులు ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి `గాడ్‌ ఫాదర్‌` హిట్‌ కొట్టేందుకు వస్తున్నారు. గత చిత్రం `ఆచార్య` పరాజయం చెందడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. వారిని ఖుషీ చేయాలనుకుంటున్నారు. ఈ సారి మిస్‌ కాదు అనేలా, అంచనాలను అందుకునేలా ఉంటుందని చెప్పారు. 

చిరంజీవి చాలా గ్యాప్‌ తర్వాత మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా చేశారు. `గాడ్‌ ఫాదర్‌` చిత్రంతో మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇది మలయాళ చిత్రం `లూసీఫర్‌`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న `గాడ్‌ ఫాదర్‌`లో  సల్మాన్‌ ఖాన్‌ ముఖ్య పాత్ర పోషించగా, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, మలయాళంలోనూ అక్టోబర్ 5న విడుదల కాబోతుంది. 

ఇప్పటికే సినిమాకి సంబంధించిన టీజర్‌, రెండు సాంగ్స్ విడుదలై ఆకట్టుకున్నాయి. మంచి ఆదరణ పొందాయి. దీంతో ఇప్పుడు ట్రైలర్‌ ఎలా ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. రేపు ఆ ట్రీట్‌ ఇవ్వబోతున్నారు చిరు. ట్రైలర్‌తో సినిమాపై హైప్‌ పెంచాలని భావిస్తుంది యూనిట్‌. ఎందుకుంటే ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో దీనికి హైప్‌ రావడం లేదు. దీంతో ట్రైలర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ ట్రైలర్‌ అంచనాలను రీచ్‌ అవుతుందా అనేది చూడాలి. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్